
- ఇండియన్స్ కు ఏడో విక్టరీ
- రాణించిన రోహిత్ , అదరగొట్టిన బౌలర్లు
నాయకుడు లేని చెన్నై ఎక్స్ ప్రెస్ మళ్లీ గాడి తప్పింది. సీజన్ లో తొలిసారి సొంతగడ్డపై పరాభవాన్ని మూటగట్టుకోవడంతో పాటు ముంబైకి వరుసగా రెండోసారి దాసోహమంది. బౌలర్ల కృషితో టేబుల్ టాపర్ స్పీడుకు బ్రేకులేసిన రోహిత్ సేన ప్లేఆఫ్ రేస్ లో మరో అడుగు బలంగా వేసింది.
చెన్నైకెప్టెన్ ధోనీ లేకుండా బరిలోకి దిగిన చెన్నై ఓ మాదిరి లక్ష్యాన్ని ఛేదిం చలేకపోయిం ది. రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్‌కు తోడు బౌలర్లంతా రాణిం చడంతో శుక్రవారం చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ముం బై 46రన్స్ తేడాతో చెన్నైని చిత్తుగా ఓడించిం ది. తొలుత ముంబై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 155పరుగులు చేసిం ది. రోహిత్ శర్మ (48 బంతుల్లో 6ఫోర్లు, 3 సిక్సర్లతో 67) హాఫ్ సెంచరీ చేయగా, ఎవిన్‌లూయిస్ (32), హార్దిక్ పాండ్యా (23 నాటౌట్)రాణిం చారు. చెన్నై బౌలర్లలో శాంట్నర్ (2/13) అద-రగొట్టా డు. ఛేజిం గ్ లో ముం బై బౌలర్ల ధాటికి చెన ్నై17.4 ఓవర్లలో 109 రన్స్‌కే కుప్పకూలి ఓడిపోయిం -ది. మురళీ విజయ్ (38) టాప్ స్కోరర్ . ముం బై బౌలర్లలో మలింగ (4/37) నాలుగు వికెట్లు తీయగా,క్రునాల్ , బుమ్రా తలో రెండు వికెట్లు పడగొట్టా రు.
చెన్నై ఢమాల్..
చిన్న టార్గెట్ ఛేజింగ్ లో చెన్నై ఏ దశలోనూ విజయానికి చేరువ కాలేకపోయిం ది. ముం బై బౌలర్లు అదరగొట్టడంతో పవర్ ప్లే ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో నిలిచింది. తొలి ఓవర్ లోనే ఆ జట్టు పతనం మొదలైం ది. సన్ రైజర్స్‌పై అదరగొట్టి ఫామ్‌లోకి వచ్చిన షేన్ వాట్సన్ (8)ను మలింగ ఫస్ట్ ఓవర్ లోనే ఔట్ చేశాడు. నాలుగో ఓవర్లో బౌలింగ్ కుదిగిన హార్దిక్ తన తొలి బంతికే చెన్నై స్టాండిన్ కెప్టెన్ రైనా(2)ను ఔట్ చేశాడు. ఆ ఓవర్ లో 4, 6 కొట్టిన ఓపెనర్ విజయ్ ఒత్తిడి పెరగకుండా చూశాడు.కానీ, అంబటి రాయుడు(0) మరోసారి విఫలమయ్యాడు. కేదార్ జాదవ్ (6) కూడా ప్రభావం చూపలేకపోయాడు. ఈ ఇద్దరినీ క్రునాల్ ఔట్ చేసి చెన్నైని దెబ్బ మీద దెబ్బ కొట్టాడు. కాసేపటికే అనుకూల్‌రాయ్ బౌలింగ్ లో అవనసర షాట్ ఆడిన ధృవ్‌షోరే(5) లాంగాన్ లో రాహుల్ కు క్యాచ్ ఇచ్చాడు.దీంతో సగం ఓవర్లకే చెన్నై ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, సీజన్ లో తొలిసారి బరిలోకి దిగిన విజయ్ ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. అయితే, 12వ ఓవర్లో స్లో బాల్ తో బుమ్రా అతడిని పెవిలియన్ చేర్చడంతో చెన్నై ఆశలు కోల్పోయింది. అయితే బ్రావో (20), శాంట్నర్ (22)పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించిం ది.16వ ఓవర్లో బ్రావోను ఔట్ చేసిన మలిం గ మ్యాచ్ నులాగేసుకున్నాడు. తన తర్వాతి ఓవర్లోనే హర్భజన్(1), శాంట్నర్ లను కూడా వెనక్కుపంపి చెన ్నైనిఆలౌట్ చేశాడు.
రోహిత్ ఒక్కడే..
ముం బై ఇన్నింగ్స్‌లో రోహిత్ క్రీజులోఉన్నంత సేపే మెరుపులు. అతను హాఫ్ సెంచరీతో సత్తా చాటినా మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో ఆ జట్టు తక్కువ స్కోరుకే సరిపెట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియన్స్‌కు మూడో ఓవర్లోనే షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్నఓపెనర్ క్వింటన్ డికాక్ (15)ను దీపక్ చహర్ ఔట్ చేశాడు.అయితే వన్ డౌన్ లో వచ్చిన ఎవిన్ లూయిస్‌తో కలిసి రోహిత్ రెండో వికెట్‌కు 75 రన్స్ జోడించి భారీ స్కోరుకు పునాది వేశాడు.భజ్జీ వేసిన ఎనిమిదో ఓవర్ లో రోహిత్ రెండు భారీ సిక్స్‌లు కొట్టగా, తాహిర్ వేసిన తర్వాతి ఓవర్ లో లూయిస్ 6, 4 కొట్టి స్కోరు బోర్డుకు ఒక్కసారిగా ఊపు తెచ్చారు.సగం ఓవర్లకు ముం బై 84/1తో మెరుగైన స్థితిలో నిలిచిం ది. ఈ దశలో చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ పరుగులు నియంత్రించారు. శాంట్నర్ వేసిన 13వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన లూయిస్.. డీప్ మిడ్ వికెట్‌లో బ్రావోకి క్యాచ్ ఇచ్చాడు. తర్వాతి బంతికి సింగిల్ తీసిన రోహిత్ హాఫ్ సెం చరీ పూర్తి చేసుకోగా..క్రునాల్ పాండ్ యా(1) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. అతడిని తాహిర్ ఔట్ చేశా డు. తాహిర్ బౌలింగ్ లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాదిన రోహిత్ జోరుమీద కనిపిం చాడు. కానీ, శాంట్నర్ బౌలింగ్ లో షాట్ ఆడే ప్రయత్నంలో అతను విజయ్ కు చిక్కాడు.అప్పటికి ముం బై స్కోరు 122/4. హార్డ్ హిట్టర్ లు హార్దిక్ పాండ్యా (23 నాటౌట్), కీరన్ పొలార్డ్(13 నాటౌట్) ఉండడంతో ముంబై మంచి స్కోరు చేస్తుందని ఫ్యాన్స్ ఆశించారు. కానీ, చెన్నై బౌలర్లు వీళ్లను షాట్లు ఆడకుండా నియత్రించారు. 18వ ఓవర్లో బ్రావో ఆరు పరుగులే ఇచ్చాడు. దీపక్ చహర్‌వేసిన 19వ ఓవర్లో ఓ ఫోర్ సహా పది రన్స్ వచ్చాయి.అయితే, బ్రావో వేసిన లాస్ట్ ఓవర్లో పొలార్డ్ ఓ ఫోర్ ,విజయ్ (38) నిరాశ హార్దిక్ 4, 6 కొట్టి స్కోరు 150 దాటించాడు.
స్కోర్ బోర్డు
ముంబై: రోహిత్ (సి) విజయ్ (బి) శాంట్నర్67, డికాక్ (సి)రాయుడు (బి) దీపక్ 15,లూయిస్ (సి) బ్రావో (బి) శాంట్న ర్ 32, క్రునాల్(సి) శాంట్నర్ (బి) తాహిర్ 1, హార్ది క్ (నాటౌట్)23, పొలార్డ్ (నాటౌట్) 13; ఎక్స్ ట్రాలు : 4 ;మొత్తం : 20 ఓవర్లలో 155/4;
వికెట్ల పతనం:1–24, 2–99, 3–101, 4–122; బౌలిం గ్ :దీపక్ 4–0– 46–1, హర్భజన్ 4–0–23–0,తాహిర్ 4–0–37–1, బ్రావో 4–0–35–0,శాంట్నర్ 4–0–13–2.
చెన్నై సూపర్ కింగ్స్ : విజయ్ (సి) సూర్యకు-మార్ (బి) బుమ్రా 38, వాట్సన్ (సి) రాహుల్(బి) మలిం గ 8, రైనా (సి) సూర్యకుమార్ (బి)హార్దిక్ 2, రాయుడు (బి) క్రునాల్ 0, జాదవ్(బి) క్రునాల్ 6, షోరే (సి) రాహుల్ (బి)రాయ్ 5, బ్రావో (సి అండ్ బి) మలిం గ 20,శాంట్నర్ (సి) పొలార్డ్ (బి) మలిం గ 22, దీపక్(సి) క్రునాల్ (బి) బుమ్రా 0, హర్భజన్ (సి)హార్దిక్ (బి) మలిం గ1, తాహిర్ (నాటౌట్)0 ;ఎక్స్ ట్రాలు : 7 ; మొత్తం : 17.4 ఓవర్లలో 109ఆలౌట్;
వికెట్ల పతనం : 1–9, 2–22, 3–34,4–45, 5–60, 6–66, 7–99, 8–101,9–103; బౌలింగ్ : మలిం గ 3.4–0–37–4,క్రునాల్ 3–0–7–2, హార్దిక్ 2–0–22–1,బుమ్రా 3–0–10–2, రాహుల్ 4–0–21–0,రాయ్ 2–0–11–1 .