ప్లే ఆఫ్ కు రోహిత్ సేన..సూపర్ ఓవర్లో సన్ రైజర్స్ పై విక్టరీ

ప్లే ఆఫ్ కు రోహిత్ సేన..సూపర్ ఓవర్లో సన్ రైజర్స్ పై విక్టరీ

ప్లేఆఫ్‌ ముంగిట సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ కు షాక్‌ . రేసులో నిలవాలంటే విజయం అనివార్యం అయినమ్యాచ్‌ లో హైదరాబాద్‌ ఓడిపోయింది. టాపార్డర్‌ విఫలమైన వేళ అద్భుత పోరాటంతో ఆటను సూపర్‌ఓవర్‌ కు తీసుకెళ్లిన మనీశ్‌ పాండే, మహ్మద్‌ నబీ..ఆఖరి ఆరు బంతుల్లో నిరాశ పరిచారు. దాంతోముంబై ఇండియన్స్‌ తో సూపర్‌ ఓవర్‌ కు దారి తీసిన మ్యాచ్‌ లో హైదరాబాద్‌ పరాజయం పాలైంది. వాంఖడే స్టేడియంలో గురువారం జరిగిన ఈమ్యాచ్‌ లో తొలుత క్వింటన్‌ డికాక్‌ (58 బంతుల్లో 6ఫోర్లు, 2 సిక్సర్లతో 69 నాటౌట్‌ ) మెరుపులతో ముంబై20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. హైదరాబాద్‌ బౌలర్లలో ఖలీల్‌‌‌‌‌‌‌‌(3/42) మూడు వికెట్లుతీయగా, నబీ, భువనేశ్వర్‌ ఒక్కో వికెట్‌ తీశారు.ఛేజింగ్‌ లో మనీశ్‌ పాండే (47 బంతుల్లో 8 ఫోర్లు,2 సిక్సర్లతో 71 నాటౌట్) అజేయ హాఫ్‌ సెంచరీచేయడంతో 20 ఓవర్లలో సన్‌ రైజర్స్‌ ఆరు వికెట్లకుసరిగ్గా 162 రన్స్‌ చేయడంతో మ్యాచ్‌ టై అయింది.సూపర్‌ ఓవర్లో హైదరాబాద్‌ ఎనిమిది పరుగులుచేయగా.. ముంబై మూడు బంతుల్లో నే 9 రన్స్‌ చేసిగెలిచింది.

పాండే పోరాటం..

ఛేజింగ్‌ లో సన్‌ రైజర్స్‌ కు అదిరిపోయే ఆరంభందక్కింది. ఓపెనర్లు మార్టిన్‌ గప్టిల్‌‌‌‌‌‌‌‌(15), వృద్ధి మాన్‌సాహా(15 బంతుల్లో 5 ఫోర్లతో 25) ధనాధన్‌ బ్యాటింగ్‌ తో చెలరేగడంతో నాలుగు ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 40కి చేరింది. అయితే, తన వరుస ఓవర్లలో వీరిద్దరినీ ఔట్‌ చేసిన బుమ్రా హైదరాబాద్‌ కు షాకిచ్చా డు. వన్‌ డౌన్‌ లో బ్యాటింగ్‌ కు దిగినమనీశ్‌ పాండే… వచ్చీరాగానే మలిం గ బౌలింగ్‌ లోమూడు ఫోర్లు కొట్టాడు. కానీ, కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (3) నిరాశపరిచాడు. క్రీజులో ఇబ్బందిగా కనిపించిన కేన్‌ ను క్రునాల్‌‌‌‌‌‌‌‌ ఎల్బీ చేయడంతో రైజర్స్‌ఇబ్బందుల్లో పడింది. ఈదశలో విజయ్‌ శంకర్‌(12)తో నాలుగో వికెట్‌ కు 33 పరుగులు జోడించిన పాండే ఇన్నింగ్స్‌ ను గాడిలో పెట్టే ప్రయత్నంచేశాడు.కానీ, క్రునాల్‌‌‌‌‌‌‌‌ వేసిన 14వ ఓవర్‌ లో భారీ షాట్‌ ఆడినవిజయ్‌ లాంగాన్‌ లో పొలార్డ్‌‌‌‌‌‌‌‌కు క్యాచ్‌ ఇచ్చా డు. ఆవెంటనే అభిషేక్‌ (2)ను ఔట్‌ చేసిన హార్దిక్‌ ఒత్తిడిమరింత పెంచాడు. దీంతో ఆఖరి ఐదో ఓవర్లలో రైజర్స్‌ కు 57 రన్స్‌ అవసరం అవసరమయ్యాయి. ఒత్తిడిపెరిగిన దశలో పాండే, నబీ వేగం పెంచారు. మలిం గబౌలింగ్‌ లో నబీ ఫోర్‌ , సిక్సర్‌ బాదగా.. బుమ్రా వేసిన19వ ఓవర్లో మనీశ్‌ రెండు ఫోర్లు కొట్టాడు. హార్దిక్‌వేసిన చివరి ఓవర్లో 17 రన్స్‌ అవసరం అవగా.. తొలిరెండు బాల్స్‌ కు రెండు సింగిల్స్‌ వచ్చాయి. మూడోబాల్‌‌‌‌‌‌‌‌కు భారీ సిక్సర్‌ కొట్టిన నబీ తర్వాతి బాల్‌‌‌‌‌‌‌‌కు ఔటయ్యాడు. ఐదో బాల్‌‌‌‌‌‌‌‌కు డబుల్‌‌‌‌‌‌‌‌ తీసిన పాండే ఆఖరిబాల్‌‌‌‌‌‌‌‌ను లాంగాన్‌ మీదు గా స్టాండ్స్‌ కు పంపడంతోస్కోర్లు సమం అయ్యాయి.

డికాక్‌‌‌‌‌‌‌‌ ఒంటరి పోరాటం

డికా క్‌ చివర్లో మెరుపులు మెరిపించినా సన్‌ రైజర్స్‌బౌలర్లు కట్టుదిట్టం గా బౌలింగ్‌ చేయడంతో పాటుకీలక సమయంలో వికెట్లు తీసి ఒత్తిడి పెంచడంతోముంబై ఇండియన్స్‌ పరుగులు కోసం పోరాడింది.టాస్‌ గెలిచి ఫస్ట్‌‌‌‌‌‌‌‌ బ్యాటిం గ్‌ కు దిగిన ముంబై ఇన్నింగ్స్‌ ను కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(18 బంతుల్లో 5 ఫోర్లతో24) దూకుడుగా ప్రారంభిం చాడు. భువనేశ్వర్‌వేసిన ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఓవర్‌ లో రెండు ఫోర్లు కొట్టి న రోహిత్‌ ..ఖలీల్‌‌‌‌‌‌‌‌ ఓవర్‌ లో మూడు బౌండరీలు బాదాడు. భువీబౌలింగ్‌ లో డికాక్‌ రెండు ఫోర్లు కొట్టి టచ్‌ లోకివచ్చా డు. ఆరో ఓవర్లో రోహిత్‌ ను ఔట్‌ చేసిన ఖలీల్‌‌‌‌‌‌‌‌ ఈ జోడీని విడదీశాడు. ఈ దశలో డికా క్‌ , సూర్యకు-మార్‌ యాదవ్‌ ( 23) జాగ్రత్తగా బ్యాటిం గ్‌చేశారు. 12వ ఓవర్లో ఫుల్‌‌‌‌‌‌‌‌ వైడ్‌ బాల్‌‌‌‌‌‌‌‌తోసూర్యకుమార్‌ ను ఖలీల్‌‌‌‌‌‌‌‌ వెనక్కుపంపగా,నబీ బౌలిం గ్‌ లో ఎవిన్‌ లూయిస్‌ (1) డీప్‌ మిడ్‌ వికెట్‌ లో శంకర్‌ కు చిక్కడంతో ముంబైకి డబుల్‌‌‌‌‌‌‌‌ షాక్‌ తగిలింది. అయితే, హార్దిక్‌ పాండ్యా (18) ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేశాడు. థంపి వేసిన 14వ ఓవర్లో 6,4 బాదాడు. కానీ, భువీ బౌలింగ్‌ లో మరోషాట్‌ ఆడి లాంగాఫ్‌ లో నబీకి చిక్కాడు. థంపి బౌలింగ్‌ లోనే బౌండ్రీ కొట్టి హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నఅతను తర్వాతి బాల్‌‌‌‌‌‌‌‌ను సిక్సర్‌ గా మలిచాడు. రషీద్‌వేసిన 18వ ఓవర్‌ లో పొలార్డ్‌‌‌‌‌‌‌‌(10) ఓ భారీ సిక్సర్‌ ,డికా క్‌ ఓ ఫోర్‌ కొట్టి వేగం పెంచారు. 19వ ఓవర్లోభువీ 4 పరుగులే ఇవ్వగా.. లాస్ట్‌‌‌‌‌‌‌‌ ఓవర్‌ ర్లో ఖలీల్‌‌‌‌‌‌‌‌ తొలి బంతికే పొలార్డ్‌‌‌‌‌‌‌‌ను ఔట్‌ చేశాడు. అయితే,క్రునాల్‌‌‌‌‌‌‌‌ (9 నా టౌట్‌ ) సిక్సర్‌ కొట్టి స్కోరు 160దాటించాడు.

సూపర్‌‌‌‌‌‌‌‌ ఓవర్‌‌‌‌‌‌‌‌ సాగిందలా

సన్ రైజర్స్ :బుమ్రా వేసిన ఫస్ట్‌ బాల్‌ కు రెండో రన్‌ కుట్రై చేసి పాండే (1) రనౌటవగా, తర్వాత గప్టిల్‌ (1) సింగిల్‌ తీశాడు. మూడోబంతికి సిక్స్‌ కొట్టిన నబీ (6)తర్వాతబౌల్డ్‌ అయ్యాడు.

ముంబై :రషీద్‌ వేసిన ఫస్ట్‌ బాల్‌ కు సిక్స్‌ కొట్టినహార్దిక్‌‌‌‌‌‌‌‌ (7 నాటౌట్‌ ), తర్వాతసిం గిల్‌ తీశాడు. మూడోబంతికి పొలార్డ్‌ (2నాటౌట్‌ )రెండు పరుగులు తీసిమ్యాచ్‌ ముగించాడు.

స్కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డు
ముంబై : రోహిత్‌ (సి)నబీ (బి) ఖలీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 24, డికాక్‌ (నాటౌట్‌ ) 69, సూర్యకుమార్‌ (సి) రషీద్‌ (బి)
ఖలీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 23, లూయిస్‌ (సి) శంకర్‌ (బి) నబీ 1, హార్ది క్‌ (సి)నబీ (బి) భువనేశ్వర్‌ 18, పొలార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (సి)
అభిషేక్‌ (బి) ఖలీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 10, క్రునాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (నాటౌట్‌ ) 9;ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రాలు : 8; మొత్తం: 20 ఓవర్లలో 162/5:
హైదరాబాద్ : సాహా (సి) లూయిస్‌ (బి) బుమ్రా25, గప్టిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఎల్బీ) బుమ్రా 15, మనీశ్‌ (నాటౌట్‌ )
71, విలియమ్సన్‌ (ఎల్ బీ) క్రునాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3; శంకర్‌(సి) పొలార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (బి) క్రునాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌12, అభిషేక్‌ (సి) డికా క్‌ (బి) హార్దిక్‌ 2 , నబీ (సి)సూర్యకుమార్‌ (బి) హార్దిక్‌ 31, రషీద్‌ (నాటౌట్‌ )0; ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రాలు: 3; మొత్తం: 20 ఓవర్లలో 162/6.