చైనా నుంచి రూ. కోటి 90 లక్షల కోట్ల పరిహారం ఇప్పించండి

చైనా నుంచి రూ. కోటి 90 లక్షల కోట్ల పరిహారం ఇప్పించండి
  • ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ముంబై లాయర్ పిటిషన్

ముంబై : కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఒక్క డ్రాగన్ నే కాదు అన్ని దేశాల్ని ముంచేసింది. ఈ మొత్తం ఘోరానికి చైనాయే కారణమంటూ ముంబై కి చెందిన లాయర్ ఆశిష్ సొహనీ…ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) లో కేసు వేశారు. కరోనాను కంట్రోల్ చేయకపోగా అన్ని దేశాలకు వ్యాపించేలా చేసిందంటూ చైనా పై ఆరోపణలు చేశారు. మొత్తం 33 పేజీల పిటిషన్ ను లాయర్ ఆశిష్ దాఖలు చేశారు. చైనా కారణంగా భారత్ తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఇందుకు భారత్ కు చైనా రూ. కోటి 90 లక్షల కోట్లు పరిహారంగా చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని ఐసీసీ ని కోరాడు. చైనా నిర్లక్ష్యం ప్రపంచాన్ని ఇబ్బందుల పాలు చేసిందంటూ లాయర్ ఆవేదన వ్యక్తం చేశారు. పిటిషన్ లో చైనా నిర్వాకాన్ని నిలదీశారు. వూహాన్ మార్కెట్ చట్టవ్యతిరేకంగా వన్య ప్రాణులను అమ్ముతుంటే ఎందుకు అరెస్ట్ చెయ్యలేదని చెప్పాలని కోరాడు. డ్రాగన్ కంట్రీ నిర్లక్ష్యం కారణంగానే కరోనా వచ్చింది గనున ఆ దేశంపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని లాయర్ డిమాండ్ చేశారు.