
హైదరాబాద్, వెలుగు: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్‌లో ముంబై మీటియర్స్ టాప్ ప్లేస్‌తో లీగ్ దశను ముగించింది. బుధవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన తమ చివరి లీగ్ పోరులో ముంబై 3–1 (15–-13, 15-–13, 18–-20, 15–-10)తో ఆఖరు గ్రూప్ బెంగళూరు టార్పెడోస్‌పై విజయం సాధించింది. ఏడు మ్యాచ్‌ల్లో ఆరో విజయంతో మీటియర్స్ అగ్రస్థానంలో నిలవగా.. ఐదు విజయాలతో బెంగళూరు టార్పెడోస్ రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. మీటియర్స్ ఆటగాడు శుభమ్ చౌదరి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.