ఆ నగరం వృద్ధులకు సేఫ్ కాదు: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో

ఆ నగరం వృద్ధులకు సేఫ్ కాదు: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో

ముంబైలో తరుచూ వృద్ధులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల కాలంలో జరిగిన దాడులు, చోరీలు, హత్యలే ఇందుకు కారణం. దనవంతులైన ఒంటరి వృద్ధులను లక్ష్యంగా చేసుకొని నేరాలకు పాల్పడుతున్నారు. పిల్లలు విదేశాల్లో స్థిరపడిన నిస్సాహాయ తల్లిదండ్రులను బెదిరించి, దాడి చేసి దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో( NCRB) 60 ఏళ్లకు పైబడిన వారికి ముంబై సురక్షితమైన ప్రదేశం కాదని ప్రకటించింది.  

ఇటీవల కాలంలో జరిగిన సంఘటనలు చూసుకుంటే.. ఓ యువతి తన యజమాని 63ఏళ్ల వృద్ధిరాలిపై దాడి చేసి ఇంట్లో చోరీకి పాల్పడింది. మరో కేసులో 81 సంవత్సరాల వృద్ధురాలిని గొంతు నులిమి లక్షా 25వేల డబ్బు దొంగలించారు. ఓ పనిమనిషి ఓనర్ న్యూడ్ వీడియోలు వైరల్ చేస్తాఅంటూ బ్లా్క్ మెయిల్ చేసిన కేసు కూడా ఈ మధ్యకాలంలో వెలుగులోకి వచ్చింది. నిత్యం ఇలాంటి ఘటనలతో ముంబైలో వృద్ధులు బలైపోతున్నారు.

ముంబై నగరంలో 2022 సంవత్సరంలో 844, 2021లో 987, 2020లో 572 నేరాలు వృద్ధులపై జరిగాయని  NCRB వెల్లడించింది. 2022లో ఐదుగురు, 2021లో నలుగురు, 2020లో 12మంది వృద్ధులు హత్యకు గురైయ్యారు. అయితే, 2023కి సంబంధించిన డేటా ఇంకా అందుబాటులో లేదు. మొత్తం మహారాష్ట్రలో మహారాష్ట్రలో 2022లో 5,059 కేసులు, 2021లో 6,190, 2020లో 4,909 కేసులు నమోదయ్యాయట. 2023 సంవత్సరానికి సంబంధించిన డేటా ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ డేటా ప్రకారం ముంబై నగరం వృద్ధులకు సేఫ్ ప్లేస్ కాదని NCRB స్పష్టం చేసింది.