ఇదేం అరాచకం : ఆఫీసుకు లేటుగా వస్తే 200 రూపాయల ఫైన్ అంట..!

ఇదేం అరాచకం : ఆఫీసుకు లేటుగా వస్తే 200 రూపాయల ఫైన్ అంట..!

ముంబైలో ఓ కంపెనీ ఎంప్లాయిస్ టైంకు రావాలని రూల్ పెట్టింది. ఎవోర్ బ్యూటీ వ్యవస్థాపకుడు కౌశల్ షా ఆఫీస్ కు లేట్ గా ప్రతిరోజు వస్తే రూ.200 ఫైన్ కట్టాలని రూల్ పెట్టాడు. ఉదయాన్నే 9. 30 నిమిషాలకు ఆఫీస్ మొదలవుతుంది. అంతకుముందు 10, 11 గంటలకు వచ్చే వారు రూల్ పెట్టాక కరెక్ట్ టైంకు వస్తున్నారు.  ఆఫీస్ కు ఆలస్యంగా వస్తే ఉద్యోగులు రూ.200 ఫైన్ కట్టాలని పెట్టిన ఫౌండర్ కౌశల్ షానే రూల్ పెట్టిన కానుంచి ఇప్పటి వరకు 5సార్లు ఫైన్ కట్టాడు. ఆ విషయాన్ని ఆయన ఎక్స్ లో షేర్ చేసుకున్నాడు. ఇలా ఫైన్ ల రూపంలో వసూలు చేసిన డబ్బును టీం లంచ్, ఈవెంట్లకు ఉపయోగిస్తామని షా అన్నారు.