ఎలాగైనా వెళ్లాలి సరే.. ఇలా వెళ్తే అసలుంటామంటారా

ఎలాగైనా వెళ్లాలి సరే.. ఇలా వెళ్తే అసలుంటామంటారా

ముంబై లోకల్ రైళ్లను సిటీ లైఫ్ లైన్ అని కూడా పిలుస్తారు. అయితే రద్దీగా ఉండే రైలును చూపించే ఓ వీడియో ప్రయాణికుల జీవితాల భద్రత గురించి పలు ప్రశ్నలను లేవనెత్తింది. ప్రజలు ఎంతటి ప్రమాదకర రీతిలో రవాణాను ఉపయోగించుకుంటున్నారో ఇది చూపించింది. ఫుట్‌బోర్డ్‌పై నిలబడిన ప్రయాణికులు గేట్‌వే అంచున, తలుపు బయట ఒకరిపై ఒకరు పడేలా.. రెండు కంపార్ట్‌మెంట్ల మధ్య గ్యాప్‌లో నిలబడి ప్రయాణించడం ఆందోళనను కలిగిస్తోంది.

ముంబై లోకల్ ట్రైన్ కోచ్‌లలో ప్రమాదకర ప్రయాణాన్ని ఈ వీడియో చూపించింది. భారీ రద్దీ ఉన్నప్పటికీ రవాణాలో సరిపోయేలా, ప్రయాణించడానికి పురుషులు, మహిళలు.. ఇద్దరూ కూడా తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఫస్ట్-క్లాస్ కోచ్‌లు కూడా కిక్కిరిసి ఉన్నాయి. చాలా మంది ప్రయాణీకులు మిడిల్ రాడ్ పట్టుకుని తమను తాము బ్యాలెన్స్ చేసుకోవడానికి కష్టపడుతున్నారు.

నెటిజన్లు ఏమంటున్నారంటే..

ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో, పలువురు ఇంటర్నెట్ యూజర్స్ దీనిపై స్పందించారు. చిత్రనిర్మాత వివేక్ అగ్నిహోత్రి కూడా ఈ క్లిప్‌ను, నగర ప్రజలు ప్రయాణించే తీవ్రమైన పరిస్థితులపై కామెంట్ చేశారు.  దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు.