వైరల్ వీడియో: పోలీస్ మ్యూజిక్.. 

వైరల్ వీడియో: పోలీస్ మ్యూజిక్.. 

ముంబయి పోలీస్ బ్యాండ్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ‘యే వతన్ తేరె లియే’ సాంగ్ వీడియో వైరల్ అవుతోంది. 1959లో రిలీజైన హిందీ సినిమా ‘కర్మ’లోని ఈ పాటతో మ్యూజిక్ ద్వారా తమ దేశభక్తిని చాటుతున్నారు. ఇప్పటికే వీళ్లు రిలీజ్ చేసిన జేమ్స్ బాండ్ సిగ్నేచర్ థీమ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్య నెట్ఫ్లిక్స్లో వచ్చిన టీవీ సిరీస్ ‘మనీ హేస్ట్’ అయిదో సీజన్లోని థీమ్ సాంగ్ ’బెల్లా చావో’ని కూడా రి–క్రియేట్ చేసింది ఈ బ్యాండ్. ఇక మీదట ‘ఖాకీ స్టూడియోస్’ పేరుతో ప్రతి సోమవారం ఒక వీడియో రిలీజ్ చేస్తారట. 
స్పెషాలిటీ ఏంటంటే...
ముంబై పోలీస్ బ్యాండ్ని 1936లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి పోలీస్ పరేడ్ వేడుకల్లో బ్యాండ్ వాయించేవాళ్లు. ఈ బ్యాండ్లో చేరిన పోలీసులు రిటైర్ అయ్యేదాకా ఇందులోనే పని చేస్తారు. దేశభక్తి గీతాలతో పాటు హిందీ, మరాఠీ పాటలని రి–క్రియేట్ చేస్తారు. దాదాపు 40 మంది ఇందులో ఉన్నారు. ఇప్పుడు ఈ బ్యాండ్కి సంజయ్ కల్యాణి అనే హెడ్కానిస్టేబుల్ హెడ్. ఇతను నేవీలో పదిహేనేళ్లు మ్యుజీషియన్గా చేసి రిటైర్ అయ్యాడు. 
మ్యూజిక్  స్ట్రెస్బస్టర్
‘‘ప్యాండెమిక్ టైంలో ప్రజలంతా ఒత్తిడిలో ఉన్నారు. వాళ్లని ఎంటర్టైన్ చేయాలని  రిలీజ్ చేసిన  జేమ్స్ బాండ్ థీమ్ వీడియో అందరికీ నచ్చింది. దాంతో, వారానికి ఒక వీడియో చేయాలని అనుకుంటున్నాం. మ్యూజిక్ అనేది మ్యాజిక్లా పనిచేయడమే కాదు స్ట్రెస్ బస్టర్ కూడా. మ్యూజిక్ మెడ్లేలు, ఇండియన్ క్లాసిక్, వెస్టర్న్ మ్యూజిక్ కలగలిపిన మ్యూజిక్ రిలీజ్ చేయాలనేది నా డ్రీమ్”అని చెబుతున్నాడు సంజయ్ కల్యాణి.