4 నెలల్లో.. రూ.4 కోట్లు పోయాయి.. వృద్ధులను పీడించి మరీ దోచుకున్నారు సైబర్ కేటుగాళ్లు..

4 నెలల్లో.. రూ.4 కోట్లు పోయాయి.. వృద్ధులను పీడించి మరీ దోచుకున్నారు సైబర్ కేటుగాళ్లు..

సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.. రోజుకో విధంగా మోసాలకు పాల్పడుతున్నారు  సైబర్ నేరగాళ్లు.. అమయాకులు, వృద్ధులు, యువత ఇలా ఎవరినీ వదలడం లేదు కేటుగాళ్లు. టెక్నాలజీని ఉపయోగించిన కూచున్న చోటి నుంచే కోట్లు సంపాదిస్తున్నారు.. టెక్నాలజీపై అవగాహణ లేకపోవడం.. సైబర్ నేరగాళ్ల మాటలను నమ్మడం, అనుచితంగా వచ్చే డబ్బును కోరుకోవడం.. ఉద్యోగం వేటలో.. ఇలా అనేక రకాలుగా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి రోజుకు ఎంతో మంది మోసపోతూ బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసుకుంటున్నారు.  దక్షిణ ముంబై కి చెందిన ఓ వృద్ధ దంపతులు ఇలాగే  సైబర్ నేరగాళ్ల చేతికి చిక్క రూ. 4 కోట్లు పోగొట్టుకున్న ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. వివరాల్లో వెళితే.. 

దక్షిణ ముంబైకి చెందిన వృద్ధ జంట ఓ కార్పొరేట్ సంస్థలో పనిచేసి రిటైర్ అయి విశ్రాంతి తీసుకుంటున్నారు. అంతా సాఫీగా సాగుతున్న వేళ.. ఓ రోజు వారికి పీఎఫ్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నామంటూ సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు.. ఇది నమ్మి.. ఫ్రాడ్ స్టర్లు అడిగిన వివరాలు ఇచ్చారు.. ఇంకేముంది.. ఆ వృద్ధ దంపతుల ఖాతాను ఖాళీ చేశారు కేటుగాళ్లు.. 

వృద్ధ దంపతులకు సంబంధించిన పీఎఫ్, ఇతర వివరాలు సేకరించిన కేటుగాళ్లు.. నిజంగా పీఎఫ్ అధికారులే అని నమ్మించి దఫాలుగా వారి నుంచి రూ. 4 కోట్లు కాజేశారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు వృద్ధులు. మీరు కార్పొరేట్ సంస్థలో పనిచేస్తున్నపుడు కంపెనీ పెట్టుబడి కోసం రూ. 4 లక్షలు ప్రావిడెంట్ ఫండ్ లో ఉంచిందని .. అది 20 యేళ్ల తర్వాత మెచ్యూర్ అయి రూ. 11 కోట్లు వచ్చాయని సైబర్ నేరగాళ్లు నమ్మబలికారు. (TDS, GST) ఆదాయపు పన్ను చెల్లింపుకోసం కొంత డబ్బును చెల్లించాలని సైబర్ నేరగాళ్లు కోరారు.. ఇలా నాలుగు నెలల్లో రూ. 4 కోట్లు కేటుగాళ్ల తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. నిందితులు రూ. 4 కోట్లు బదిలీ చేయించుకునేందుకు డజనుకు పైగా బ్యాంకు ఖాతాలను ఉపయోగించారు. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ బ్యాంకులో వృద్ధ జంట ఖాతాలు ఖాళీ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

ఇలా వృద్ధ దంపతులు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు.. సో.. బీ అలెర్ట్.. సైబర్ కేటుగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్త వహించండి. 

ALSO READ :- ఎస్సీ, ఎస్టీ, బీసీలంతా ఒక్కటి కావాల్సిన సమయం ఆసన్నమైంది : విశారదన్ మహరాజ్