ముంబైని ముంచెత్తిన వాన..వీధుల్లో మోకాల్లోతూ నీళ్లు..అంధేరీ సబ్వే బంద్

ముంబైని ముంచెత్తిన వాన..వీధుల్లో మోకాల్లోతూ నీళ్లు..అంధేరీ సబ్వే బంద్

ముంబై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం (జూలై 15) ముంబైలోని పశ్చిమ, తూర్పు శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బాంద్రా, అంధేరి, గోరేగావ్, ములుండ్, విఖ్రోలిలలో వీధుల్లో మోకాల్లోతు నీళ్లు నిలిచాయి. 

అంధేరి సబ్ వే లో నీరు నిలిచిపోవడంతోట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రానున్న గంటల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముంబైనగరానికి  ఆరెంజ్ అలెర్ట్,  ముంబై పొరుగు జిల్లాలు రాయగఢ్, థానే, రత్నగిరి, ముంబై సబర్బన్ ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. మరోవైపు పుణెకు ఎల్లో అలెర్ట్ జారీ అయింది. 

ముంబై పశ్చిమ శివారు ప్రాంతాలైన బాంద్రా, అంధేరి, గోరేగావ్ ,తూర్పు శివారు ప్రాంతాలైన ములుండ్, విఖ్రోలిలలో గత అరగంటగా భారీ వర్షాలు కురిశాయి. నగరంలో నీరు నిలిచిపోవడంతో అంధేరి సబ్వేను ట్రాఫిక్ కోసం మూసివేశారు.

భారీ వర్షాలతో IMD) మంగళవారం నగరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో ముంబై పోలీసులు తీరప్రాంత ,లోతట్టు ప్రాంతాలను సందర్శించకుండా ఉండాలని అధికారులు హెచ్చరించారు.   ముంబైలోని అంధేరి వెస్ట్‌లోని అంధేరి సబ్‌వేలో 2 అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ను మూసివేసి గోఖలే వంతెన మీదుగా మళ్లించారు. థానే ,పూణేలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా రాయ్‌గడ్‌కు రెడ్ అలర్ట్ ,పాల్ఘర్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. 

రాబోయే నాలుగు రోజుల్లో ముంబై ,సమీప ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. రాబోయే 3-4 గంటల్లో ముంబై , థానేలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు కూడా ఉండవచ్చని IMD తెలిపింది. గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వీధుల్లో నీరు నిలిచిపోవడం తో నగరంలోని ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.

నగరంలో భారీ వర్షాల కారణంగా పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వివిధ విమానయాన సంస్థలు విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ సమస్యల గురించి జాగ్రత్తగా ఉండాలని ప్రయాణీకులను కోరుతూ సలహాలు జారీ చేశాయి.