ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం.. గెలుపు తమదేనంటున్న పార్టీలు

ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం.. గెలుపు తమదేనంటున్న పార్టీలు

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. కరోనా తీవ్రత దృష్ట్యా 72గంటల ముందే ప్రచారాన్ని క్లోజ్ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ పాటు మరో ఐదు మున్సిపాలిటీలకు ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. శుక్రవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఓటింగ్ నిర్వహించేందుకు SEC ఏర్పాట్లు చేస్తోంది. గ్రేటర్ వరంగల్‌లో 6,51,488 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 

ఖమ్మం కార్పొరేషన్‌లో 60 సీట్లకు గాను ఒక్క సీటు ఏకగ్రీవం అయింది. మిగతా 59 సీట్లకు 251 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వరంగల్‌లో 66 స్థానాలకు గాను.. 502 మంది పోటీలో ఉన్నారు. అచ్చంపేట మున్సిపాలిటీలో 20 సీట్లకు గాను 66మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సిద్దిపేటలో 43సీట్లకు గాను 236 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నకిరేకల్ 20 సీట్లకు గాను 93 మంది బరిలో ఉన్నారు. జడ్చర్లలో 27 సీట్లకు గాను 112 మంది అభ్యర్థులు.. కొత్తూరులో 12 సీట్లకు 47 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పోలింగ్ నిర్వహణ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 30న పోలింగ్ జరగనుండగా.. మే 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు.