వీడియో: బాలుడు లంచం ఇవ్వలేదని.. కోడిగుడ్ల బండి పడేసిన అధికారులు

వీడియో: బాలుడు లంచం ఇవ్వలేదని.. కోడిగుడ్ల బండి పడేసిన అధికారులు

లంచం ఇవ్వలేదని కోడిగుడ్ల బండిని అధికారులు తోసేయడంతో.. గుడ్లన్నీ పగిలిపోయాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. ప్రస్తుతం లాక్డౌన్ వల్ల అక్కడ షాపులు తెరవడానికి ఎడమ-కుడి నియమాన్ని అనుసరిస్తున్నారు. ఒకరోజు ఎడమ వైపు షాపులు తీస్తే.. మరుసటి రోజు కుడి వైపు షాపులు తీయాలి. అయితే ఇండోర్ లో ఒక 14 ఏళ్ల బాలుడు ఎడమ-కుడి విధానానికి వ్యతిరేకంగా.. తన కోడిగుడ్ల బండిని రోడ్డు పక్కన పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాడు. అటుగా వచ్చిన అధికారులు ఆ బాలుడిని కోడిగుడ్ల బండి అక్కడి నుంచి తీసేయాలని లేకపోతే రూ. 100 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ రెండింటికి బాలుడు నిరాకరించడంతో.. కోపంతో అధికారులు కోడిగుడ్ల బండిని కింద పడేశారు. దాంతో బండి మీద ఉన్న గుడ్లన్నీ పగిలిపోయాయి. గుడ్లన్నీ పగులగొట్టడంతో బాలుడు ఆ అధికారులను దూషిస్తూ ఏం చేయలేక అలాగే ఉండిపోయాడు.

‘కరోనా వల్ల అసలే వ్యాపారం జరగడం లేదు. ఇప్పుడు వీళ్లు నా బండిని పడేశారు. దాంతో గుడ్లన్నీ పగిలిపోయాయి. కరోనా వల్ల నష్టం వచ్చింది అనుకంటుంటే.. మళ్లీ వీళ్ల వల్ల కూడా మరో నష్టం వచ్చింది. వాళ్లు నన్ను బండి తీసేయమన్నారు లేకపోతే రూ. 100 లంచం ఇవ్వాలన్నారు. నేను ఒప్పుకోకపోవడంతో నా బండిని పడేశారు’ అని ఆ బాలుడు ఆరోపించాడు.

కరోనా వల్ల పెద్ద మరియు చిన్న వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కేంద్రం గత నెలలో దుకాణాలను మరియు మార్కెట్లను కొన్ని ఆంక్షలతో తెరవడానికి అనుమతించింది. అందుకే మధ్యప్రదేశ్ ప్రభుత్వం అక్కడ ఎడమ-కుడి విధానాన్ని అమలు చేస్తోంది. అయితే ఈ విధానం వల్ల వ్యాపారులు నష్టపోతున్నారని.. వెంటనే ఎడమ-కుడి విధానాన్ని రద్దు చేయాలని పలువురు నాయకులు సీఎంకు లేఖ రాశారు.

For More News..

కూతురు ఆన్ లైన్ క్లాసుల కోసం ఆవు అమ్మిన తండ్రి

దేశంలో నిన్న ఒక్కరోజే 49,310 కేసులు నమోదు

కేటీఆర్ కు మెగాస్టార్ బర్త్ డే విషెస్