రూల్స్ పాటించని హోటల్స్​కు రూ. 75 వేల ఫైన్

రూల్స్ పాటించని హోటల్స్​కు రూ. 75 వేల ఫైన్
  • తనిఖీలు చేసిన శంకర్​పల్లి మున్సిపల్ అధికారులు 

శంకర్ పల్లి, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి మున్సిపాలిటీలోని హోటల్స్ లో మున్సిపల్​ కమిషనర్​ శ్రీనివాస్​ గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పలు హోటల్స్ లో పారిశు ధ్య నిర్వహణ, ఆహార పదార్థాల నిల్వ సరిగా లేకపోవడంతో.. వారికి రూ. 75వేల జరిమానా వేశారు.

హోటల్స్ యజమానులు ప్రభుత్వ రూల్స్ కచ్చితంగా పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో  మేనేజర్, శానిటరీ ఇన్ స్పెక్టర్ , శానిటేషన్ సిబ్బంది ఉన్నారు.