తొలిరోజు జోరుగా నామినేషన్లు

తొలిరోజు జోరుగా నామినేషన్లు

ఇబ్రహీంపట్నం/మేడ్చల్ కలెక్టరేట్/ వికారాబాద్, వెలుగు:  మున్సిపల్ ఎన్నికలకు బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో రంగారెడ్డి జిల్లాలోని ఆమన్​గల్​లో తొలిరోజు 8 మంది, చేవెళ్లలో 9 మంది, ఇబ్రహీంపట్నంలో ముగ్గురు, మొయినాబాద్ లో ఆరుగురు, షాద్​నగర్​లో ఆరుగురు, శంకర్‌పల్లిలో 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

వికారాబాద్​జిల్లాలోని పరిగిలో 2, తాండూర్​లో 11, వికారాబాద్​లో​ 12 నామినేషన్లు దాఖలయ్యాయి. మేడ్చల్ జిల్లాలోని ఎల్లంపేట్ మున్సిపాలిటీలో 4, మూడుచింతలపల్లిలో 8, అలియాబాద్​లో 16 నామినేషన్ వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.