- చివరి రోజు జోరుగా నామినేషన్లు దాఖలు
- సెంటర్లకు భారీగా తరలివచ్చిన అభ్యర్థులు
- మంచిర్యాల కార్పొరేషన్లో
- 377 మంది అభ్యర్థులు, 615 నామినేషన్లు
మంచిర్యాల, వెలుగు : మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నామినేషన్ల పర్వం శనివారం ముగిసింది. ఈనెల 28 నుంచి 30 వరకు ఆయా మున్సిపాలిటీల్లోప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి నామినేషన్లు స్వీకరించారు. మొదటి రోజు నామమాత్రంగా దాఖలైనప్పటికీ మిగతా రెండు రోజులు భారీ సంఖ్యలో వచ్చాయి. చివరి రోజు సాయంత్రం 5 గంటల వరకు వచ్చినవారిని లోపలికి అనుమతించి పొద్దు పోయేదాక నామినేషన్లు స్వీకరించారు. వివిధ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి బలప్రదర్శన చేశారు.
పలు మున్సిపాలిటీల్లో ఇంకా టికెట్లు కన్ఫామ్కాకపోవడంతో ఆశావహులు పార్టీల పేరిట, ఇండిపెండెంట్‌గా నామినేషన్లు వేశారు. ఒక్కొక్కరు రెండు, మూడు సెట్లు దాఖలు చేశారు. మరికొందరు ముందుజాగ్రత్తగా తమ ఫ్యామిలీ మెంబర్లతో కూడా నామినేషన్లు వేయించారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ప్రకటించారు. బీజేపీ తొలి విడతలో 10 డివిజన్ల అభ్యర్థులను ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు రాంచందర్‌రావు ప్రకటించారు.
నామినేషన్ల విత్డ్రాకు ఈ నెల 3వరకు గడువు ఉంది. ఈలోగా బీఫారాలు సమర్పించిన వారికి ఎన్నికల అధికారులు పార్టీ గుర్తులు కేటాయిస్తారు. అదే రోజు ఇండిపెండెంట్లకు గుర్తులు ప్రకటిస్తారు. జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్న కలెక్టర్లు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తొలి ఘట్టం ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
మంచిర్యాల కార్పొరేషన్లో..
మంచిర్యాల కార్పొరేషన్లో 60 డివిజన్లకు గాను వివిధ పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు 377 మంది 615 నామినేషన్లు వేశారు. శనివారం ఒక్కరోజే 429 సెట్లు దాఖలయ్యాయి. క్యాతనపల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు 241, లక్సెట్టిపేటలో 15 వార్డులకు 157 నామినేషన్లు వచ్చాయి. బెల్లంపల్లి మున్సిపాలిటీలో 34 వార్డులకు 259, చెన్నూరు మున్సిపాలిటీలో 18 వార్డులకు 225 నామినేషన్లు దాఖలయ్యాయి.
నిర్మల్‌జిల్లాలో..
నిర్మల్, బైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లోని 80 వార్డులకు మొత్తం 635 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు 464 నామినేషన్ లు దాఖలు కావడం గమనార్హం. నిర్మల్ మున్సిపాలిటీలో మొత్తం 42 వా ర్డులకు 320 నామినేషన్లు దాఖలయ్యాయి. భైంసా మున్సిపాలిటీలో 26 వార్డులకు 202, ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 వార్డులకు 113 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు.
ఆదిలాబాద్ జిల్లాలో..
ఆదిలాబాద్మున్సిపాలిటీలో మొత్తం 49 వార్డులు ఉండగా, 721 నామినేషన్లు దాఖలయ్యాయి
నామినేషన్ల వివరాలు...
మున్సిపాలిటీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అదర్స్ స్వతంత్ర మొత్తం
మంచిర్యాల 150 159 177 85 44 615
క్యాతనపల్లి 87 53 34 26 33 241
లక్సెట్టిపేట 42 42 42 13 18 157
చెన్నూర్ 74 49 37 30 42 159
కాగజ్‌నగర్ 57 72 48 8 20 230
ఆసిఫాబాద్ 47 37 30 13 34 166
