
వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో హంగ్ పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ అన్ని పార్టీలకు ప్రాధాన్యం ఇచ్చారు ఓటర్లు. మొత్తం 10 స్థానాల్లో సీపీఎం 2, సీపీఐ 1, టీడీపీ 1, టీఆర్ఎస్ 3, బీజేపీ 1, కాంగ్రెస్ 1, ఇండిపెండెంట్స్ 1 స్థానంలో గెలుపొందారు. ఇప్పుడు ఇక్కడ చైర్మన్ పీఠం ఎవరు సొంతం చేసుకుంటారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఒక ఇండిపెండెంట్‌తో పాటు ఇతరులెవరినైనా లాగేసి అధికార పార్టీనే ఈ మున్సిపాిలిటీని కూడా కైవసం చేసుకునే చాన్స్ ఉందని తెలుస్తోంది.