ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తేలిన మున్సిపల్ రిజర్వేషన్ల లెక్క..

 ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తేలిన మున్సిపల్ రిజర్వేషన్ల లెక్క..
  • వార్డుల వారీగా రిజర్వేషన్లపై నేడు స్పష్టత
  • మహిళల రిజర్వేషన్లపై ఖరారుకు హాజరుకావాలని లీడర్లకు లేఖలు 

నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు : ఉమ్మడి నిజామాబాద్ ​జిల్లాలో ని మున్సిపాలిటీల రిజర్వేషన్ల లెక్క తేలింది.   శనివారం ఉదయం 10 గంటలకు లాటరీ పద్ధతిలో డివిజన్​, వార్డుల రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులను  మహిళల రిజర్వేషన్ల ఖరారుకు హాజరవ్వాలని సూచిస్తూ  మున్సిపల్ అధికారులు లేఖలు ఇచ్చారు. 

నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్​, ఆర్మూర్​, భీంగల్​ మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లను తేల్చారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు చేయాల్సిన స్థానాలను కేటాయించారు.  బీసీలకు కేటాయించాల్సిన సీట్లను నిర్ణయించారు. అన్​రిజర్వ్​తో పాటు మహిళల సీట్ల సంఖ్యను ప్రభుత్వం ప్రకటించింది.

నిజామాబాద్​జిల్లాలో..  

ఇందూర్​ నగర పాలక సంస్థలో 60 డివిజన్​లు ఉన్నాయి. ఇందులో ఎస్టీ జనరల్​కు ఒక డివిజన్, ఎస్సీ జనరల్​కు 3, ఎస్సీ మహిళలకు రెండు డివిజన్లు కేటాయిస్తారు. బీసీ జనరల్ 12, బీసీ మహిళలకు 12 డివిజన్​లు కేటాయిస్తారు. అన్​రిజర్వు కేటగిరీలో మహిళలకు 16, అన్​రిజర్వు జనరల్​లో 14 డివిజన్లు ఉంటాయి. 

బోధన్​మున్సిపాలిటీ...

బోధన్​ మున్సిపాలిటీ పరిధిలో  38 వార్డులు ఉన్నాయి. ఎస్టీ జనరల్​కు1, ఎస్సీ జనరల్​కు 2, ఎస్సీ మహిళకు ఒక వార్డును లాటరీ ద్వారా నిర్ణయిస్తారు. బీసీ జనరల్​ 8, బీసీ మహిళలకు 7 వార్డులు, అన్​రిజర్వు జనరల్​లో 8, మహిళలకు 11 వార్డులు  కేటాయించనున్నారు. 

ఆర్మూర్​మున్సిపాలిటీ..

ఆర్మూర్​ పురసంఘం పరిధిలోని 36 వార్డులు ఉన్నాయి. ఎస్టీ జనరల్​కు 1, ఎస్సీ జనరల్​కు 2, ఎస్సీ మహిళకు 1, బీసీ జనరల్ 7, బీసీ మహిళలకు 7 వార్డులు రిజర్వు చేస్తారు. అన్ రిజర్వుడ్​ జనరల్​ కింద 8, ​ మహిళలకు 10 వార్డులు కేటాయించనున్నారు.

భీంగల్​మున్సిపాలిటీ..

భీంగల్​ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. ఇందులో ఎస్టీ జనరల్​కు 1, ఎస్సీ జనరల్​కు 1, మహిళకు 1, బీసీ జనరల్​కు 2, బీసీ మహిళకు ఒక వార్డు అలాట్ చేయనున్నారు. అన్​ రిజర్వుడ్​ జనరల్​ కేటగిరీలో 2, అన్​రిజర్వ్​డ్​ మహిళలకు 4 వార్డులను కేటాయించనున్నారు.  

కామారెడ్డి జిల్లాలో..

కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్​కుంద మున్సిపాలిటీల్లో 92 వార్డులు ఉన్నాయి. ఇందులో బీసీలకు  31 వార్డులు కేటాయించగా, జనరల్ 17, మహిళలకు 14 స్థానాలు,  జనరల్ మహిళలకు  26 సీట్లు,  ఆన్​రిజర్వుడు  21 వార్డులు,  ఎస్సీలకు 10 ఉండగా ఇందులో 5 మహిళలకు, 5 జనరల్​,  ఎస్టీలకు 4 వార్డులను జనరల్​కు కేటాయించారు.  

కామారెడ్డి మున్సిపాలిటీ..

కామారెడ్డి మున్సిపాలిటీలో49  వార్డులు ఉన్నాయి. బీసీలకు 19 రిజర్వు కాగా, ఇందులో 9 మహిళలకు, 10 జనరల్,  జనరల్ మహిళలకు 13,   ఆన్​రిజర్వుడు 12,  ఎస్సీలకు 4 వార్డులు కాగా, ఇందులో 2 మహిళలకు, 2 జనరల్, ఎస్టీలకు 1 వార్డు కేటాయించారు. 

బాన్సువాడ మున్సిపాలిటీ..

బాన్సువాడ మున్సిపాలిటీలో  19 వార్డులు ఉన్నాయి.  బీసీలకు 6 స్థానాలు కేటాయించగా, ఇందులో 3 మహిళలు, 3 జనరల్ స్థానాలు,  జనరల్ మహిళలకు 5, ఆన్​రిజర్వుడు  5,  ఎస్సీలకు 2 కేటాయిస్తే ఇందులో 1 మహిళ, 1 జనరల్. ఎస్టీలకు1 స్థానాలను కేటాయించారు. 

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ...

ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి.  ఇందులో  బీసీలకు  3 స్థానాలు రిజర్వు చేస్తే ఇందులో మహిళలకు 1, జనరల్ 2 స్థానాలు, జనరల్ మహిళలకు 4, ఆన్​రిజర్వుడు 2, ఎస్సీలకు 2  కేటాయిస్తే ఇందులో 1 మహిళలకు, 1 జనరల్, ఎస్టీలకు 1 వార్డు కేటాయించారు.

బిచ్​కుండ మున్సిపాలిటీ..

బిచ్​కుంద మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. ఇందులో బీసీలకు 3 స్థానాలు రిజర్వు చేస్తే, ఇందులో మహిళలకు1, జనరల్ 2,  జనరల్​ మహిళలకు 4, ఆన్​రిజర్వుడు 2,  ఎస్సీలకు 2 వార్డుల్లో 1 మహిళలకు, 1 జనరల్, ఎస్టీలకు 1 వార్డు కేటాయించారు.   

ఫైనల్​ ఓటరు లిస్టు రిలీజ్..

వార్డుల వారీగా ఆయా మున్సిపాలిటీల్లో పొటోలతో కూడిన  ఫైనల్ ఓటరు లిస్టును శుక్రవారం అధికారులు రిలీజ్ చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఓటరు లిస్టుతో పాటు,  పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల అయ్యింది.  ఇక్కడ 49 వార్డుల్లో 152 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.  

నేడు రిజర్వేషన్లపై లాటరీ 

నిజామాబాద్​ కార్పొరేషన్​తో పాటు మూడు మున్సిపాలిటీల్లోని డివిజన్, వార్డు రిజర్వేషన్స్​ కోసం కలెక్టరేట్​లోని వీడియో కాన్ఫరెన్స్​ హాల్​లో లాటరీ తీస్తాం.  ఉదయం 10 గంటలకు భీంగల్, 10.15 గంటలకు ఆర్మూర్, 10.30 గంటలకు బోధన్​ మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్ లాటరీ ముగించాక చివరగా నగర పాలక సంస్థ లాటరీ తీస్తాం. గుర్తింపు పొందిన పార్టీల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హాజరుకావాలి. ఇలా త్రిపాఠి, కలెక్టర్​