మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు: లైవ్ అప్డేట్స్

మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు: లైవ్ అప్డేట్స్

మునుగోడులో టీఆర్ఎస్ విజయం

మునుగోడులో టీఆర్ఎస్ విజయం సాధించింది. 10వేల 341 ఓట్లతో మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై గెలిపొందారు. తొలి రౌండ్ నుంచి బీజేపీ, టీఆర్ఎస్ మధ్య హోరాహోరి పోరు నడిచింది. రౌండ్ రౌండ్ కు నువ్వా..నేనా అన్నట్టు పోరు సాగింది. దాదాపు 10 రౌండ్ల వరకు స్వల్ప మెజార్టీతో కనిపించిన కారు పార్టీ..11వ రౌండ్ నుంచి స్పష్టమైన మెజార్టీ ప్రదర్శించింది. మొత్తం 15 రౌండ్లలో  రెండు, మూడు రౌండ్లలో మాత్రమే కమలం పార్టీ ముందంజలో నిలిచింది. మిగతా అన్ని రౌండ్లలో కారు దూసుకుపోయింది. 

 

14వ రౌండ్ ముగిసే సమయానికి టీఆర్ఎస్కు 10,128  ఓట్ల మెజార్టీ

టీఆర్ఎస్  – 95,064
బీజేపీ –  84,917

మునుగోడులో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు

మునుగోడులో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతయ్యింది. 13 రౌండ్లు ముగిసేసరికి ఆ పార్టీకి 20వేల లోపే ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ తరుపున పాల్వాయి స్రవంతి పోటీ చేశారు. 
 

13వ రౌండ్ ముగిసే సమయానికి టీఆర్ఎస్కు 9,039  ఓట్ల మెజార్టీ

టీఆర్ఎస్  – 88,452
బీజేపీ –  79,360

నైతిక విజయం నాదే : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఉపఎన్నికలో నైతికంగా తానే గెలిచినట్లు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు.టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పోలింగ్ రోజు కూడా డబ్బులు పంచి ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారన్నారు. తనను ప్రచారం చేయనివ్వలేదని.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. కేసీఆర్ అవినీతి సొమ్ముకు కమ్యూనిస్టులు అమ్ముడుపోయారని విమర్శించారు. 

12వ రౌండ్ ముగిసే సమయానికి టీఆర్ఎస్కు 7836 ఓట్ల మెజార్టీ

  • టీఆర్ఎస్  –  81,634
  • బీజేపీ –  74,014

11వ రౌండ్ ముగిసే సమయానికి టీఆర్ఎస్కు 5704 ఓట్ల మెజార్టీ

  • టీఆర్ఎస్  – 74,194
  • బీజేపీ –  68,616


10వ రౌండ్ ముగిసే సమయానికి టీఆర్ఎస్కు 4243 ఓట్ల మెజార్టీ

  • టీఆర్ఎస్  – 66,980 
  • బీజేపీ –  62,862 

తొమ్మిదో రౌండ్ ముగిసే సమయానికి టీఆర్ఎస్కు 3,632ఓట్ల మెజార్టీ

  • బీజేపీ  – 55,845
  • టీఆర్ఎస్  – 59,477
  • కాంగ్రెస్  – 13,689

ఎనిమిదో రౌండ్ ముగిసే సమయానికి 2904 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్

  • బీజేపీ – 49,339
  • టీఆర్ఎస్ – 52,243
  • కాంగ్రెస్ – 13,689

ఏడో రౌండ్ ముగిసే సమయానికి టీఆర్ఎస్కు 2,572 ఓట్ల మెజార్టీ

  • బీజేపీ – 43,151
  • టీఆర్ఎస్ – 45,723
  • కాంగ్రెస్ – 12,025

ఆరో రౌండ్ ముగిసే సరికి 2,169 ఓట్ల మెజార్టీలో టీఆర్ఎస్

  • బీజేపీ – 36,352
  • టీఆర్ఎస్ – 38,521
  • కాంగ్రెస్ – 12,025

అధికారులపై తీరు అనుమానాలకు తావిస్తోంది: రఘునందన్ రావు

మునుగోడు బై పోల్ ఐదో రౌండ్ ఫలితం వెల్లడి ఎందుకు ఆలస్యమైందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. ఈ విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయని అన్నారు. అనుభవంలేని అధికారులకు కౌంటింగ్ బాధ్యతలు అప్పగించారని, వారి తీరు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందునే ఆలస్యమవుతోందన్న సీఈఓ వికాస్ రాజ్ వ్యాఖ్యల్ని ఆయన తప్పుబట్టారు. మొదటి నాలుగు రౌండ్లలో 47 మంది అభ్యర్థులు లేరా అని ప్రశ్నించారు.

ఐదో రౌండ్ లో 1531 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్

  • టీఆర్ఎస్ – 32,505
  • బీజేపీ –  30,974
  • కాంగ్రెస్ –  10,063

పొరపాటు జరిగితే ఈసీకే మచ్చ: ఈటల రాజేందర్

ఫలితాల వెల్లడిలో ఎందుకు ఆలస్యమవుతోందని సీఈఓ వికాస్ రాజ్తో ఈటల రాజేందర్ మాట్లాడారు. మునుగోడులో జరిగిన దాడులు, మద్యం, డబ్బు పంపిణీని అడ్డుకోకపోవడంతో ఈసీపై రాంగ్ ఒపీనియన్ వచ్చిందని చెప్పారు. గెలుపోటములు సహజమేనన్న ఆయన.. పొరపాటు జరిగితే ఈసీకే మచ్చ వస్తుందన్న విషయం గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు.

నాల్గో రౌండ్ ముగిసే సరికి 714 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్

  • టీఆర్ఎస్ –  26,443
  • బీజేపీ –  25,729
  • కాంగ్రెస్ –  7,380

నాల్గో రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యం

  • టీఆర్ఎస్ – 4855
  • బీజేపీ – 4560
  • ఇప్పటి వరకు చౌటుప్పల్ మండల ఓట్ల లెక్కింపు పూర్తి
  • మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంఛార్జ్గా ఉన్న దేవులమ్మ నాగారంలో ఆధిక్యంలో బీజేపీ

ఎక్కువ అభ్యర్థులు ఉన్నందునే ఫలితం ఆలస్యం : సీఈఓ వికాస్ రాజ్

మునుగోడులో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోందని సీఈసీ వికాస్ రాజ్ స్పష్టం చేశారు. కౌంటింగ్ ప్రక్రియ పారదర్శతతో జరుగుతోందని, ఈ విషయంలో ఎవరూ సందేహించాల్సిన అవసరం లేదని చెప్పారు. మొత్తం ప్రక్రియ సంతృప్తికరంగా ఉన్నప్పడే అబ్జర్వర్లు ఫలితాలు వెల్లడిస్తారని చెప్పారు. 

టీఆర్ఎస్ కుట్ర చేస్తోంది:వివేక్ వెంకటస్వామి

మునుగోడు ఫలితాల విషయంలో టీఆర్ఎస్ కుట్ర చేస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఫలితాలు తారు మారు చేసేందుకే వాటిని ఈసీ వెబ్ సైట్ లో పెట్టడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఈఓ వికాస్ రాజ్ కు ఫోన్ చేసినా ఆయన స్పందించడం లేదని వాపోయారు.

కౌంటింగ్ కేంద్రం వద్ద జర్నలిస్టుల నిరసన

మునుగోడు బైపోల్ కౌంటింగ్ ఆలస్యం అవుతుండటంతో మీడియా ప్రతినిధులు కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. మొదటి రౌండ్ నుంచి నాలుగో రౌండ్ వరకు కౌంటింగ్ స్పీడ్గా జరిగినా.. గంట గడిచినా ఐదో రౌండ్ ఫలితాలు వెల్లడించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల కోసం కనీస సదుపాయాలు ఏర్పాటు చేయలేదని వాపోయారు.

నాల్గో రౌండ్ మళ్లీ లెక్కించాలె : రాజగోపాల్ రెడ్డి

నాల్గో రౌండ్ ఫలితాలపై బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. చౌటుప్పల్లో బీజేపీకి ఆధిక్యం వస్తుందని భావించామని..అయితే ఈ మండలంలో టీఆర్ఎస్కు ఎక్కువ ఓట్లు వచ్చాయని అన్నారు. ఈ నేపథ్యంలో నాల్గో రౌండ్ ఓట్లను మరోసారి లెక్కించాలని డిమాండ్ చేశారు. 

సీఈఓ వికాస్ రాజ్పై కిషన్ రెడ్డి ఆగ్రహం

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. రౌండ్లవారీగా ఫలితాలు వెల్లడించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి ఫోన్ చేసిన 10 నిమిషాల్లోనే 4 రౌండ్ల ఫలితాలను సీఈఓ అప్లోడ్ చేశారు.

బైపోల్ రిజల్ట్స్లో అనుమానాస్పదంగా  సీఈఓ వైఖరి : బండి సంజయ్

మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల విషయంలో సీఈఓ వైఖరిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్కు లీడ్ వస్తే తప్ప రౌండ్లవారీగా ఫలితాలు అప్డేట్ చేయడంలేదని మండిపడ్డారు. బీజేపీకి లీడ్ వచ్చినా మీడియా నుంచి ఒత్తిడి వస్తే తప్ప రౌండ్లవారీగా ఫలితాలు ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు.

చౌటుప్పల్లో ఊహించిన మెజార్టీ రాలేదు: రాజగోపాల్ రెడ్డి 

చౌటుప్పల్లో అనుకున్నంత మెజార్టీ రాలేదని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బీజేపీ గెలుస్తుందన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారుతున్నాయని, చివరి వరకు హోరాహోరి పోరు తప్పక పోవచ్చని చెప్పారు. 

మూడో రౌండ్ ముగిసే సరికి ఆధిక్యంలో టీఆర్ఎస్

  • టీఆర్ఎస్ – 21,489
  • బీజేపీ – 21175
  • కాంగ్రెస్ – 5718
  • కౌంటింగ్ హాల్ నుంచి బయటకు వెళ్ళిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి
  • నాల్గో రౌండ్ లో ఆధిక్యంలో కొనసాగుతున్న బీజేపీ
  • మంత్రి మల్లారెడ్డి ఇంఛార్జ్గా ఉన్న ఆరెగూడెం, కాటరేవురెడ్డి వావి గ్రామంలో బీజేపీ ఆధిక్యం
  • మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంఛార్జ్గా ఉన్న లింగోజిగూడెంలో బీజేపీ ఆధిక్యం
  • తొలి రెండు రౌండ్లలో కలిపి కేఏ పాల్కు 34 ఓట్లు

మూడో రౌండ్ లో బీజేపీకి 36 ఓట్ల ఆధిక్యం

  • టీఆర్ఎస్ – 7390
  • బీజేపీ –  7426
  • బీజేపీ లీడ్  –  36
  • మూడు రౌండ్లు ముగిసే సరికి 510 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ 
  • మూడో రౌండ్ లో బీజేపీకి 1000కిపైగా ఓట్ల ఆధిక్యం
  • మొదటి రౌండ్లో టీఆర్ఎస్, రెండు, మూడు, నాల్గో రౌండ్లలో బీజేపీకి ఆధిక్యం

రెండో రౌండ్ లో 318 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్

  • బీజేపీ – 13,859
  • టీఆర్ఎస్ –  14,177
  • కాంగ్రెస్ –  3,597
  • టీఆర్ఎస్ లీడ్ –  318
  • చౌటుప్పల్ లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ 

తొలి రౌండ్లో టీఆర్ఎస్కు ఆధిక్యం

  • టీఆర్ఎస్ –  6,418 
  • బీజేపీ –  5126
  • కాంగ్రెస్ –  2,100 
  • టీఆర్ఎస్ ఆధిక్యం – 1,352

రాజగోపాల్కు ఆల్ ది బెస్ట్ చెప్పిన కూసుకుంట్ల

బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఇద్దరు ఎదురుపడ్డారు. రాజగోపాల్కు షేక్ హ్యాండ్ ఇచ్చిన కూసుకుంట్ల ఆయనకు ఆల్ ది బెస్ట్ అన్నారు.

పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్ఎస్ కు 4 ఓట్ల ఆధిక్యం

మునుగోడు బైపోల్ లో మొత్తం 686 ఓట్లు పోల్ కాగా.. టీఆర్ఎస్ కు 228, కాంగ్రెస్కు 0, బీఎస్పీకి 10 ఓట్లు వచ్చాయి. 

ప్రారంభమైన కౌంటింగ్

మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. అభ్యర్థులు ఏజెంట్ల సమక్షంలో ఎన్నికల అధికారులు కౌంటింగ్ హాల్స్ ఓపెన్ చేశారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ జరపనున్నారు. అనంతరం ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభంకానుంది. మొదటి మూడు రౌండ్లలో చౌటుప్పల్, నారాయణపురం మండలాల ఓట్లు లెక్కించనున్నారు. ఆ తర్వాత మునుగోడు చండూరు, చివరగా గట్టుప్పల్, మర్రిగూడ, నాంపల్లి మండలాల ఫలితాలు వెలువడనున్నాయి.

సైలెంట్ ఓటింగ్ కలిసొస్తుంది : రాజగోపాల్ రెడ్డి

ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనే ఓటింగ్ శాతం పెరిగిందని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంచి ఫలితం వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. సైలెంట్ ఓటింగ్ కలిసొస్తుందని భావిస్తున్నామని అన్నారు.

తక్కువ మెజార్టీతో అయినా గెలుస్తాం : పాల్వాయి స్రవంతి

కాంగ్రెస్ పార్టీ తక్కువ మెజార్టీతోనైనా గెలుస్తుందని ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ధీమా వ్యక్తం చేశారు. సాయంత్రం 4 గంటల వరకు జరిగిన పోలింగ్ నే ఎగ్జిట్ పోల్స్ పరిగణలోకి తీసుకున్నాయని చెప్పారు. ప్రచారంలో మంచి స్పందన వచ్చిందన్న ఆమె.. గెలుపోటములకు ప్రభుత్వంలోని అందరి బాధ్యత అందరి బాధ్యత ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఏజెంట్లను కౌంటింగ్ హాల్లోకి పంపుతున్న అధికారులు

ఒక్కో అభ్యర్థి తరఫున 21 మంది ఏజెంట్లకు అనుమతి

మొదట చౌటుప్పల్ మండల ఓట్లు లెక్కించనున్నారు.

ఒక్కో రౌండ్లో 21 పోలింగ్ కేంద్రాల ఓట్లు లెక్కించనున్నారు.

21 టేబుళ్లు 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది.