రాజీనామా చేస్తామంటున్న సర్పంచ్.. వార్డు సభ్యులు

రాజీనామా చేస్తామంటున్న సర్పంచ్.. వార్డు సభ్యులు

అభివృద్ధి చేయలేకపోతున్నందున్న తమ పదవులకు రాజీనామా చేస్తామని మునుగోడు మేజర్ మ పంచాయతీ వార్డు సభ్యులు అంటున్నారు. పంచాయతీలో 14 వార్డు సభ్యులున్నారు. సర్పంచ్ ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందారు. ఎన్నిక జరిగి మూడున్నరేళ్లు కావస్తున్నా.. ఎటువంటి అభివృద్ధి చేయలేకపోతున్నామని వార్డు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు అడిగితే లేవని అధికారులు చెబుతున్నారంటున్నారు. అభివృద్ధి చేపట్టక వార్డుల్లో తిరగలేక పోతున్నామంటూ పంచాయతీ భవనం ముందు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం స్పందించకుంటే తామంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తామన్నారు. పంచాయతీలో డబ్బులు లేవని.. నిధులు లేకపోతే పనులు ఎలా చేస్తామని ప్రశ్నించారు.

అభివృద్ధి ఎక్కడ ? అంటూ ప్రజలు నిలదీస్తున్నారని దీంతో వార్డుల్లో తిరగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఊర్లలో రాష్ట్ర సర్కార్ చెప్పిన పనులన్నీ చేసుకుంటూ పోయిన సర్పంచులకు అప్పులే మిగిలాయి. ఏడాదిగా ట్రెజరీల్లో చెక్కులు పాస్​ కాకపోవడంతో బిల్లులు పేరుకుపోయాయి. ఫలితంగా అప్పులు పెరగడం, వడ్డీలు మీదపడుతుండడంతో సర్పంచులు పార్టీలకతీతంగా ఆందోళనబాట పట్టారు. ఇందులో మెజార్టీ సర్పంచులు అధికార పార్టీవాళ్లే ఉన్నారు. ఇప్పటికే నాలుగు విడతల పల్లె ప్రగతి పనుల బిల్లులు చాలా పెండింగ్ లో ఉన్నాయంటున్నారు.