14వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ ముందంజ

14వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ ముందంజ

మునుగోడులో విజయం దిశగా టీఆర్ఎస్ దూసుకుపోతోంది. బీజేపీ రెండు, మూడు రౌండ్లలో మాత్రమే ఆధిక్యం కనబర్చినా...మిగతా రౌండ్లు అన్నీ కారు పార్టీ ముందంజలో నిలిచింది. మునుగోడు బైపోల్ 14వ రౌండ్ లో అధికార టీఆర్ఎస్ ముందంజలో నిలిచింది. టీఆర్ఎస్ కు 6,612 ఓట్లు పోలవ్వగా..బీజేపీకి 5,557 ఓట్లు వచ్చాయి. 14  రౌండ్లు ముగిసే సమయానికి మొత్తంగా టీఆర్ఎస్ కు  10,128 ఓట్ల ఆధిక్యం లభించింది. ఇక చివరిగా15 రౌండ్ నాంపల్లి మండలంకు సంబంధించి ఓట్లను లెక్కిస్తున్నారు. 

మునుగోడు బై పోల్ లో కాంగ్రెస్ కు డిపాజిట్ గల్లంతైంది. ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి 13 రౌండ్లు పూర్తయ్యే సమయానికి 20వేల లోపు ఓట్లను మాత్రమే సాధించారు. దీంతో ఆమెకు ఎన్నికల డిపాజిట్ దక్కే అవకాశం లేదు. శాసనసభకు పోటీ చేయాలంటే రూ.10వేలను అభ్యర్థి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5వేలు చెల్లిస్తే చాలు. పోలైన మొత్తం ఓట్లలో అభ్యర్థికి కనీసం ఆరింట ఒక వంతు ఓట్లు రావాల్సి ఉంటుంది.  అంటే 16.6 శాతం ఓట్లను అభ్యర్థి సాధించగలిగితే డిపాజిట్ సొమ్మును తిరిగి ఇచ్చేస్తారు.  కానీ పాల్వాయి స్రవంతి 16.6 శాతం ఓట్లను సాధించలేకపోయారు. దీంతో ఆమె డిపాజిట్ ను దక్కించుకునే చాన్స్ ను కోల్పోయారు. మరోవైపు బై పోల్ 13వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. విజయం దిశగా ఆ పార్టీ దూసుకెళ్తోంది. 13 రౌండ్లు ముగిసే సరికి మొత్తం 9,039  ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది.