నాకు పార్టీలతో పని లేదు.. మీకోసం పనిచేస్తా: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

నాకు పార్టీలతో పని లేదు.. మీకోసం పనిచేస్తా: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

తనకు  పార్టీలతో పని లేదని..మునుగోడు ప్రజల కోసం పనిచేస్తానని అన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. చౌటుప్పల్ మున్సిపాలిటీ  కాంగ్రెస్  క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిశారు ట్రిపుల్ ఆర్  రైతులు.

ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. ట్రిపుల్ ఆర్ రైతుల సమస్యల కొరకు ఎంత వరకైనా వెళ్తానని చెప్పారు. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ విషయంలో గత ప్రభుత్వం చౌటుప్పల్ రైతులకు అన్యాయం చేసిందన్నారు.  దివిస్ కంపెనీతో గత ప్రభుత్వం కుమ్మక్కై అలైన్  మెంట్ మార్చి, రైతులను మోసం చేశారని ఆరోపించారు రాజగోపాల్ రెడ్డి.   

ట్రిపుల్ ఆర్ రైతులకు సహాయం చేస్తానన్న రాజగోపాల్ రెడ్డి..  భూమి కోల్పోతున్న రైతులకు  మంచి రేటు ఇపించే ప్రయత్నిస్తానని చెప్పారు. మరోసారి ట్రిపుల్  అలైన్ మెంట్  గురించి అధికారులుతో చర్చిస్తానని తెలిపారు.  రేపు అసెంబ్లీలో ముఖ్యమంతితో మాట్లాడి ట్రిపుల్ ఆర్ రైతుల  సమస్యను తెలియజేస్తానని చెప్పారు.  తాను మునుగొడు ప్రజల అందరికీ ఎమ్మెల్యేనని.. తనతో కాకుంటే ఇంకెవరితోనూ ఈ పని కాదన్నారు. తనకు పార్టీలతో పని లేదని.. ప్రభుత్వంతో మాట్లాడి మీ సమస్య తీర్చేందుకు ప్రయత్నం చేస్తానని రాజగోపాల్ రెడ్డి అన్నారు.