ప్రముఖ సినీ నటుడు మురళీ మోహన్(Murali mohan )కు చెందిన జయభేరి(Jayabheri) నిర్మాణ సంస్థలకు శనివారం హైడ్రా అధికారులు నోటిసులు (HYDRA notices) జారీ చేసిన విషయం తెలిసిందే. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్(Financial District) లోని రంగళాల్ కుంట (Rangalal Kunta Pond)చెరువు ఎఫ్ టి ఎల్ మరియు బఫర్ లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని జయభేరి నిర్మాణం సంస్థకు ఆదేశాలు జారీ చేశారు హైడ్రా అధికారులు. వాటిపై మురళీ ఆదివారం స్పందించారు.
33 ఏళ్లుగా తాను రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానన్నారు మురళీమోహన్.. తాను ఎలాంటి అక్రమణలకు పాల్పడలేదని, బఫర్ జోన్ లో 3 అడుగుల మేరకు ఓ రేకుల షెడ్ ఉన్నట్లు గుర్తించామని అధికారులు ఆయనకు నోటీసులు వచ్చాయన్నారు. దాని కూల్చివేతకు హైడ్రా రావాల్సిన అవసరం లేదని.. ఆ షెడ్డును తామే కూల్చేస్తామని మురళీ మోహన్ తెలిపారు.
Also Telangana :- భారీ వర్షాలతో తెలంగాణ
హైడ్రా కమిషనర్ రంగనాథ్ భాగీరథమ్మ చెరువును పరిశీలించి.. ఎఫ్టిఎల్, బఫర్ జోన్లో ఉన్న నిర్మాణ వ్యర్ధాలను వేయడంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. మరో 15 రోజుల్లో పూర్తిస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగలాల్ కుంట చెరువులో ఫుల్ ట్యాంక్ లెవల్ (FTL), బఫర్ జోన్ లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని జయభేరి నిర్మాణ సంస్థకు హైడ్రా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.