అధికారులపై TRS నేతల రౌడీయిజం : మురళీధర్ రావు

అధికారులపై TRS నేతల రౌడీయిజం : మురళీధర్ రావు

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో FRO అనితపై జరిగిన దాడిని ఖండించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. టీఆర్ఎస్ నేతలు అధికారులపై రాడీయిజం చేశారని అన్నారు. ఇది చాలా దారుణమైన సంఘటన అన్నారు. విధుల్లో ఉన్న ఫారెస్ట్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మురళీధర్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఒకటి చెబుతుంటే… అధికార పార్టీ ప్రజాప్రతినిధులే అందుకు వ్యతిరేకంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారాయన.