చాయ్ తాగుతుంటే వచ్చి చంపేశారు: జగద్గిరిగుట్ట ఎల్లమ్మబండలో ఘటన

చాయ్ తాగుతుంటే వచ్చి చంపేశారు: జగద్గిరిగుట్ట ఎల్లమ్మబండలో ఘటన

హైదరాబాద్: చాయ్ తాగుంటే వచ్చి ఓ యువకుడిని పట్టపగలే దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ భయంకర ఘటన హైదరాబాద్ శివారులోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి ఎల్లమ్మబండలో మంగళవారం (ఆగస్ట్ 5) మధ్యాహ్న సమయంలో జరిగింది. యువకుడు ఓ హోటల్‎లో చాయ్ తాగుతుండగా ఆటోలో వచ్చిన దుండగులు కత్తులతో విచక్షణరహితంగా దాడి చేశారు. 

తలపై కత్తులతో పొడిచారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. దుండగులు మారణాయుధాలతో విచక్షణరహితంగా దాడి చేయడంతో భయాందోళనకు గురైన స్థానికులు ఆపేందుకు కూడా ప్రయత్నించలేదు. హత్య అనంతరం దుండగులు మళ్లీ ఆటోలో పారిపోయారు.  

హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‎మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాత కక్షల వల్లే ఈ హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. నడి రోడ్డుపై యువకుడిని దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేయడంతో ఎల్లమ్మబండలో భయంకర వాతావరణం నెలకొంది.