హంతకులే పోలీసులను శిక్షిస్తున్నారు... కాంగ్రెస్ పై బీజేపీ సెటైర్లు

హంతకులే పోలీసులను శిక్షిస్తున్నారు... కాంగ్రెస్ పై బీజేపీ సెటైర్లు

ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా బెంగళూరులో జరిగిన తొక్కిసలాట తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం సిటీ కమిషనర్ దయానంద్ ను సస్పెండ్ చేసింది. ఆర్సీబీ మేనేజ్మెంట్, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థపై కేసు నమోదు చేసి పలువురిని అరెస్ట్ కూడా చేశారు పోలీసులు. సిటీ కమిషనర్ అరెస్ట్ పై స్పందించిన కర్ణాటక బీజేపీ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ కు చురకలంటించింది.. హంతకులే పోలీసులను శిక్షిస్తున్నారంటూ సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ల ఏఐ ఫోటోను షేర్ చేసింది బీజేపీ. ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

కాగా.. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం ఆర్సీబీ మేనేజ్మెంట్ పై కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో శుక్రవారం ( జూన్ 6 ) కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో RCB మేనేజ్మెంట్  నుండి నిఖిల్ సోసాలే, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ DNA నుండి సునీల్ మాథ్యూలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు పోలీసులు.

ఈ ఘటనకు బాధ్యులైన వారిని అరెస్టు చేయాలని సీఎం సిద్దరామయ్య ఆదేశించిన క్రమంలో RCB, DNA, సహా కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (KSCA)పై కేసు నమోదు చేశారు. KSCA అధికారులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని తెలిపారు పోలీసులు.ఈ ఘటనకు బాధ్యులుగా భవిస్తూ గురువారం ( జూన్ 5 ) బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ బి దయానందతో పాటు పలువురు సీనియర్ అధికారులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు సీఎం సిద్దరామయ్య. కాగా..  కర్ణాటక హైకోర్టు ఈ సంఘటనను సుమోటోగా స్వీకరించి, జూన్ 10 నాటికి స్థితి నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.