- ముగియనున్న మూసారంబాగ్ చరిత్ర
- రెండేండ్ల కిందటే సమాంతరంగా
- కొత్త బ్రిడ్జి నిర్మాణం షురూ
- వచ్చే ఏడాది మార్చిలోపు పూర్తి చేసేందుకు ప్లాన్
- కూల్చివేస్తున్న చోట కూడా రూ.52 కోట్లతో మరో బ్రిడ్జి
- జూన్‌లోపు కంప్లీట్ చేయాలని నిర్ణయం
హైదరాబాద్ సిటీ, వెలుగు : వర్షాలు, వరదలతో ప్రమాదకరంగా మారిన మూసారంబాగ్ బ్రిడ్జిని జీహెచ్ఎంసీ అధికారులు రెండురోజులుగా కూల్చివేస్తున్నారు. ఇటీవల వచ్చిన భారీ వరదలకు ఈ బ్రిడ్జి కోతకు గురైంది. దీంతో పటిష్టతను పరిశీలించిన జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ నిపుణులు రిపేర్లు చేసినా ప్రయోజనం లేదని తేల్చారు.
దీని స్థానంలో రూ.56 కోట్లతో కొత్త బ్రిడ్జి నిర్మించబోతున్నారు. ఈ బ్రిడ్జిపై కొంతకాలంగా సమస్యలు ఎదురవతుండడంతో సమాంతరంగా మరో బ్రిడ్జి నిర్మాణ పనులను రెండేండ్ల కిందటే ప్రారంభించారు. ఈ పనులు మందకొడిగా సాగుతుండడం, ఉన్న బ్రిడ్జి కూడా కూల్చేస్తుండడంతో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులను స్పీడప్చేయాలని డిసైడ్అయ్యారు. వచ్చే ఏడాది మార్చిలోపు పనులు పూర్తి చేయాలని టార్టెట్ గా పెట్టుకున్నారు.
రూ.52 కోట్లతో కొత్త బ్రిడ్జి
కూల్చివేస్తున్న చోట మరో కొత్త బ్రిడ్జిని రూ.52 కోట్లతో కట్టాలని నిర్ణయించిన బల్దియా..పనులను వచ్చే నెలలో మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. పనులు స్పీడ్‌గా కొనసాగించి జూన్ లోగా పూర్తి చేస్తామని చెప్తున్నారు. అయితే, ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ప్రభుత్వ హయాంలోనే టెండర్లు వేసి డీపీఆర్కూడా పూర్తి చేశారు.
కానీ, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు భారీగా వరద వచ్చి గేట్లు ఎత్తినప్పుడు మాత్రమే వీటి ప్రస్తావన తీసుకువచ్చేవారు. 2020లో కూడా వరదలు వచ్చినప్పుడు బ్రిడ్జి నిర్మాణం గురించి మాట్లాడారు. తర్వాత పట్టించుకోలేదు. 2022 జులైలో కూడా జంటజలాశయాల గేట్లు ఎత్తినప్పుడు మూసారాంబాగ్ బ్రిడ్జి బంద్ చేశారు.
ఆ తర్వాత కూడా పలు మార్లు బ్రిడ్జిని క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఈ ఏడాది భారీ వరదలతో బ్రిడ్జి డ్యామేజీ కావడం, రోడ్డు కొట్టుకుపోవడం, బ్రిడ్జిపై ఐరన్తేలడంతో కాంగ్రెస్ప్రభుత్వం ఇంజినీరింగ్నిపుణుల సలహా కోరింది. దీంతో వారు ఈ బ్రిడ్జి వల్ల ముప్పు ఉంటుందని తెలిపింది. దీంతో దీన్ని కూల్చివేసి కొత్త బ్రిడ్జి కట్టాలని నిర్ణయించారు. వచ్చే నెలలో పనులు ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు ప్లాన్చేస్తోంది. దీనివల్ల అంబర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాలకు మూసారంబాగ్ మీదుగా ప్రయాణించే వారికి ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయి.
1984లో పాత బ్రిడ్జి నిర్మాణం
ముసారంబాగ్బ్రిడ్జిని1984 లో ఎన్టీఆర్ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించారు. దిల్ సుఖ్ నగర్, మలక్పేట్వెళ్లే వారు ఈజీగా జర్నీ చేయడానికి దీన్ని కట్టారు. అప్పటి నుంచి కోర్ సిటీ నుంచి విజయవాడ హైవేకి త్వరగా చేరుకోడానికి ప్రధాన మార్గంగా దీన్ని ఉపయోగించేవారు. అయితే, మూసీకి వరదలు వచ్చినప్పుడల్లా దీనిపై నుంచి వరద భారీగా ప్రవహించేది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడేది.
