సిల్హెట్: పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ పట్టు బిగించింది. ముష్ఫికర్ రహీమ్ (137) రికార్డు సెంచరీ చేయడంతో.. 110/3 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం మూడో రోజు ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 102.2 ఓవర్లలో 390 రన్స్‌కు ఆలౌటైంది. దాంతో పాక్ ముందు 437 రన్స్ లక్ష్యాన్ని ఉంచింది. ముష్ఫికర్, లిటన్ దాస్ (69) నాలుగో వికెట్‌కు 123 రన్స్ జోడించారు.
ఈ క్రమంలో కెరీర్‌లో 14వ సెంచరీ చేసిన ముష్ఫికర్... బంగ్లా తరఫున అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా మోమినుల్ హక్ రికార్డును వెనక్కి నెట్టాడు. మెహిదీ హసన్ (19), తైజుల్ ఇస్లామ్ (22) మోస్తరుగా ఆడినా.. ముష్ఫికర్‌తో కలిసి మరో 77 రన్స్ జోడించారు. ఖుర్రమ్ షాజాద్ 4, సాజిద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టారు. తర్వాత ఛేజింగ్‌కు దిగిన పాక్ ఆట ముగిసే టైమ్‌కు రెండో ఇన్నింగ్స్‌లో 2 ఓవర్లలో ఒక్క రన్ కూడా చేయలేదు.
