
ముషీరాబాద్, వెలుగు: జర్నలిస్టుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ చెప్పారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో బుధవారం హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ 6వ మహాసభలు జరిగాయి. చీఫ్ గెస్ట్‌గా హాజరైన ముఠా గోపాల్ మాట్లాడుతూ.. జర్నలిస్టులు సమాజ బాగు కోసం పనిచేస్తారన్నారు. కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య , ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య, ఐఎఫ్‌డబ్ల్యూజే సెక్రటరీ ఆనందం, టీడబ్ల్యూజేఎఫ్ కార్యదర్శులు పాల్గొన్నారు.
హెచ్ఐయూజే నూతన కమిటీ
ఈ మహాసభలో 38 మందితో హెచ్ఐయూజే నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా బి.అరుణ్ కుమార్, కార్యదర్శిగా బొల్లె జగదీశ్వర్, ట్రెజరర్‌గా రాజశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి.నాగవాణి, ఉపాధ్యక్షుడిగా గండ్ర నవీన్, జాయింట్ సెక్రటరీలుగా జీవన్‌రెడ్డి, తలారి శ్రీనివాస్‌రావు తదితరులు ఎన్నికయ్యారు.