కోల్‌కతా: ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో సత్తా చాటిన హైదరాబాద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో మూడో విజయం సాధించింది. మంగళవారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన గ్రూప్–బి మ్యాచ్‌లో హైదరాబాద్ 3 వికెట్ల తేడాతో యూపీపై గెలిచింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడో విక్టరీతో12 పాయింట్లతో టాప్ ప్లేస్‌లోకి వచ్చింది. స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ (3/29), పేసర్ రక్షణ్ రెడ్డి (3/31) దెబ్బకు తొలుత యూపీ జట్టు 19.2 ఓవర్లలో 127 రన్స్ కే ఆలౌటైంది.
మాధవ్ కౌశిక్ (37), ఆరాధ్య యాదవ్ (24) తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు. సీవీ మిలింద్ రెండు వికెట్లు తీశాడు. అనంతరం ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (26 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 43) మెరుపులతో హైదరాబాద్ 17.1 ఓవర్లలో 129/7 స్కోరు చేసి గెలిచింది. అమన్ రావు (22), రాహుల్ బుద్ధి (21) కూడా రాణించారు. తనయ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. గురువారం జరిగే తర్వాతి మ్యాచ్‌లో హైదరాబాద్ జమ్మూ కాశ్మీర్‌తో తలపడనుంది.
సెంచరీతో సూర్యవంశీ మరో రికార్డు
బీహార్ యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (61 బాల్స్‌లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 108 నాటౌట్) ముస్తాక్ అలీ టోర్నీలో సెంచరీ చేసిన యంగెస్ట్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. 18 ఏండ్ల వయసులో సెంచరీ కొట్టిన మహారాష్ట్ర బ్యాటర్ (2013లో ముంబైపై) పేరిట ఉన్న రికార్డును 14 ఏండ్ల బీహార్ బ్యాటర్ వైభవ్ బ్రేక్ చేశాడు.
అయినా మహారాష్ట్రతో జరిగిన గ్రూప్ –బి మ్యాచ్‌లో బీహార్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలుత సూర్యవంశీ జోరుతో బీహార్176/3 స్కోరు చేసింది. ఛేజింగ్‌లో కెప్టెన్ పృథ్వీ షా (66) మెరుపులతో మహారాష్ట్ర 19.1 ఓవర్లలో182/7 స్కోరు చేసి గెలిచింది.
