4 గేట్ల ద్వారా మూసీలోకి వరద

4 గేట్ల ద్వారా మూసీలోకి వరద

హైదరాబాద్, వెలుగు: ఉస్మాన్ సాగర్ కు పై నుంచి మళ్లీ వరద పెరిగింది. శనివారం వరకు 600 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా ఆదివారం 1,300 క్యూసెక్కులకు పెరిగింది. తెల్లవారుజామున వరకు రెండు గేట్ల నుంచి మూసీలోకి నీటిని వదిలిన అధికారులు ఉదయం 11 గంటలకు మరో రెండు గేట్లు ఎత్తి మొత్తం నాలుగు గేట్ల ద్వారా దిగువకు పంపిస్తున్నారు. ప్రస్తుతం అవుట్ ఫ్లో1,552 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులు కాగా, 1,786.65 అడుగుల నీరు ఉంది. అలాగే హిమాయత్ సాగర్​కు 400 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, ఒక గేటు ద్వారా అవుట్​ఫ్లో 330 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. పూర్తి నీటిమట్టం 1,763.50 అడుగులు కాగ, ప్రస్తుతం 1,760.95 అడుగుల నీరు ఉంది.