కొట్టుకుపోయిన మూసీ ప్రాజెక్ట్ గేటు… ఆందోళనలో రైతులు

కొట్టుకుపోయిన మూసీ ప్రాజెక్ట్ గేటు… ఆందోళనలో రైతులు

వరద నీరు ఎక్కువ కావడంతో మూసీనది ఆరవ నెంబర్ గేటు కొట్టుకుపోయింది. దీంతో భారీగా నీళ్లు కిందికి వెళ్తున్నాయి. రేపు పొద్దున కల్లా ప్రజెక్ట్ ఖాళీ అవనుంది. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన పడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు నాగార్జునా సాగర్ తరువాత మూసీ నదే అతిపెద్ద సాగునీటి వనరుగా ఉంది. గత ఏడాదే 19కోట్లతో కేసీఆర్ సర్కార్.. మూసీ నదికి మరమ్మత్తులు చేయించింది.

గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాలకు మూసీ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరదలు మూసీనదిలో కలుస్తున్నాయి. దీంతో మూసీనీటి మట్టం ఇవాల పొద్దునకు 644.50 అడుగులకు చేరింది. మూసీ నిండుకుండలా ఉన్న సమయంలో గేటు కొట్టుకుపోవడంతో అక్కడి పరివాహక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.