మూసీ బ్యూటిఫికేషన్ కు ముందడుగు

మూసీ బ్యూటిఫికేషన్ కు ముందడుగు
  •     సబర్మతి, యమున, నమామి గంగా ప్రాజెక్ట్ ల  పరిశీలన
  •     ఆయా రాష్ట్రాల రివర్ ప్రాజెక్ట్ ల ఉన్నతాధికారులతో భేటీ అయిన ఎంఆర్ డీసీఎల్ ఎండీ ఆమ్రపాలి,అధికారుల టీమ్ 

హైదరాబాద్, వెలుగు : మూసీ నది బ్యూటిఫికేషన్ కు ముందడుగు పడింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినది తెలిసిందే. ఆయన ఆదేశాలతో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్ డీసీఎల్​) మేనేజింగ్ డైరెక్టర్ ఆమ్రపాలి, అధికారుల టీమ్ గుజరాత్ లోని అహ్మదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, యమునా రివర్ ఫ్రంట్‌‌ ప్రాజెక్ట్ లను సందర్శించారు. 

ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులతో భేటీ అయి ప్రాజెక్ట్ లపై స్టడీ చేశారు. బుధవారం సబర్మతి ప్రాజెక్ట్ ను , శనివారం యమున ప్రాజెక్టును పరిశీలించారు. ఆయా ప్రాజెక్టుల సివరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ల (ఎస్టీపీ) చూశారు. అదేవిధంగా నమామి గంగా ప్రాజెక్టు డైరెక్టర్ జనరల్(డీజీ) అశోక్ కుమార్ తో  సమావేశమై చర్చించారు. ఆయా ప్రాజెక్టులపై తమ అనుభవాలను ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులు రాష్ట్ర అధికారుల టీమ్ కు వివరించారు.