HBDDeviSriPrasad: స్వర సంగీత సంచలనం దేవి శ్రీ ప్రసాద్ స్పెషల్ స్టోరీ

HBDDeviSriPrasad: స్వర సంగీత సంచలనం దేవి శ్రీ ప్రసాద్ స్పెషల్ స్టోరీ

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్(Devi Sri Prasad).. ఈ పేరు వింటేనే థియేటర్స్ అన్నీ ఊగిపోతాయి. తన ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజిక్ తో సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లడం మనోడి స్టైల్. సినిమా ఏదైనా, హీరో ఎవరైనా, భాష ఏదైనా తను అందించే మ్యూజిక్ లో మాత్రం తేడా ఉండదు. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా పోస్టర్ పై దేవి పేరుందంటే మ్యూజికల్ హిట్ అవ్వాల్సిందే. అంతలా తన మ్యూజిక్ తో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు దేవి శ్రీ ప్రసాద్.అంతేకాదు ప్రస్తుతం సౌత్ లో టాప్ అండ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కోనసాగుతున్న దేవి చేతిలో సౌత్ టాప్ స్టార్ హీరోల క్రేజీ సినిమాలున్నాయి. 

ఇవాళ ఆగస్ట్ 2న సంగీత సంచలనం దేవి శ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్బంగా పలు సినీ ఇండస్ట్రీస్ నుండి విషెష్ అందుతున్నాయి. తాజాగా పుష్ప 2, తండేల్ మేకర్స్ రాక్‌స్టార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 

అవార్డులు:

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు (సైమా అవార్డులు)లలో భాగంగా తెలుగులో సైమా ఉత్తమ సంగీత దర్శకుడు విభాగంలో అత్యధికంగా 11సార్లు నామినేటై, ఏడుసార్లు అవార్డును గెలుచుకున్నాడు. 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో పుష్ప (2021) సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడు విభాగంలో జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డు అందుకున్నాడు 

సినిమా కెరీర్:

1999 తెలుగులో దేవి సినిమాకి సంగీతాన్ని అందించి మంచి పేరు తెచ్చుకున్నారు. 19 సంవత్సరాల వయస్సులోనే వరుస సినిమాలకు సైన్ చేస్తూ బాగా బిజీ అయ్యారు దేవి. ఇక 1999 (అప్పటి నుంచి) 2024 వరకు తన 25 ఏళ్ల మ్యూజిక్ కెరీర్ ను కొనసాగిస్తూ..సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తున్నాడు.

25 ఏళ్లు (1999 మార్చి 12-2024 మార్చి 12) తన స్వర సంగీతంతో ఉర్రుతలు ఊగించిన దేవి శ్రీ కి ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి స్పెషల్ విషెష్ అందుతున్నాయి. ఫ్యాన్స్ కూడా దేవి పాటలతో రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఎంత మంది మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చిన దేవి శ్రీ ది ప్రత్యేక స్థానం. ఇలానే మరిన్ని సినిమాలతో ఫ్యాన్స్ కు దగ్గరవ్వాలని ఆశిస్తూ..అల్ ది బెస్ట్ అండ్ బెస్ట్ విషెష్ దేవి అన్న. 

2018 సంవత్సరం దేవికి ప్రధానమైనది. రంగస్థలం (సౌండ్‌ట్రాక్) ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి విస్తృత గుర్తింపు మరియు ప్రశంసలను అందుకుంది. ఈ ఆల్బమ్‌లో "రంగమ్మ మంగమ్మ" మరియు " జిగేలు రాణి " వంటి అత్యంత ప్రజాదరణ పొందిన కొన్ని తెలుగు పాటలు ఉన్నాయి . 

ఇక సుకుమార్, హరీష్ శంకర్ సినిమాలతో దేవి ఎప్పుడు బిజీగా ఉంటాడనేది తెలిసిందే. పుష్ప సినిమాతో జాతీయస్థాయిలో అవార్డు కూడా అందుకున్నారు. ఇప్పుడు పుష్ప 2 తో ఆ పరంపర కొనసాగిస్తూ..మరిన్ని బడా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు.