
వాషింగ్టన్: ‘ఎక్స్’ నిర్వహించిన ఫ్యాక్ట్‌చెక్‌ను ఓ చెత్తగా పేర్కొన్న అమెరికా ప్రెసిడెంట్ట్రంప్వాణిజ్య సలహాదారు పీటర్నవారో వ్యాఖ్యలపై ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్ స్పందించారు. తప్పు ఎవరు చేసినా సరే తమ ‘ఎక్స్’ కమ్యూనిటీ నోట్స్ సరిచేస్తుందని తెలిపారు. ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండబోదని స్పష్టం చేశారు. అయితే, నవారో పేరెత్తకుండా మస్క్ చురకలంటించారు.
‘‘ఈ ప్లాట్‌ఫామ్‌లో ప్రజలు కథనాన్ని నిర్ణయిస్తారు. మీరు వాదనను అన్ని వైపులా వింటారు. కమ్యూనిటీ నోట్స్ మినహాయింపులు లేకుండా ప్రతి ఒక్కరినీ సరిచేస్తాయి. గమనికలు, డేటా, కోడ్ ఇవన్నీ పబ్లిక్ సోర్స్. గ్రోక్ మరింత వాస్తవ తనిఖీని వినియోగదారులకు అందిస్తుంది” అని వ్యాఖ్యానించారు.
కాగా, భారత్ విధిస్తున్న సుంకాల వల్ల అమెరికా ఉద్యోగాలు దెబ్బతింటున్నాయని, లాభం కోసమే ఆ దేశం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్‌ను కొనుగోలు చేస్తున్నదని నవారో ఆరోపించారు. ఉక్రెయిన్యుద్ధానికి ముందు రష్యానుంచి భారత్ కొనుగోళ్లు జరపలేదని, ఇప్పుడు ఉక్రెయిన్‌పై యుద్ధానికి రష్యాకు ఆర్థిక సహకారం అందించేందుకే కొనుగోళ్లు జరుపుతున్నదని కామెంట్ చేశారు.
నవారో చేసిన ఈ పోస్ట్‌పై ‘ఎక్స్’ ఫ్యాక్ట్ చెక్‌చేసింది. నవారో కామెంట్స్‌ను కొట్టిపారేసింది. భారత్ ఎలాంటి ఆంక్షలను ఉల్లంఘించడం లేదని తెలిపింది. దీంతో ఎలాన్‌మస్క్‌కు చెందిన ‘ఎక్స్’పైనా నవారో విరుచుకుపడ్డారు. ఫ్యాక్ట్ చెక్ఒక చెత్త అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మస్క్స్పందించారు. ‘ఎక్స్’లో అన్నివైపులా వాదనలు వినాల్సిందేనని, ఏకపక్షంగా ఏదీ ఉండదని నవారోనుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.