గ్రేటర్ వరంగల్, వెలుగు : హిందూ.. ముస్లిం భాయ్ భాయ్ అనడమే కాదు, చేతల్లో చూపించారని వరంగల్ డీసీసీ అధ్యక్షుడు మహ్మద్ అయూబ్ అన్నారు. మహ్మద్ అయూబ్ ఆధ్వర్యంలో ఆదివారం గ్రేటర్ వరంగల్లోని19వ డివిజన్ కాశీబుగ్గలోని రాముల వారి ఆలయంలోని అయ్యప్ప స్వామి దీక్షాపరులకు భిక్ష ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కాంగ్రెస్జిల్లా అధ్యక్షుడు మహ్మద్అయూబ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ జిల్లా ప్రజలకు అయ్యప్పస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్సీ సారయ్య మాట్లాడుతూ అయూబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం కాంగ్రెస్ లౌకికవాదానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గుండేటి నరేందర్, యువజన విభాగం అధ్యక్షుడు కొరివి పరమేశ్, తూర్పు సీనియర్ నాయకులు కరాటే ప్రభాకర్, రాష్ట్ర ఓబీసీ కో–ఆర్డినేటర్ కోదాటి అనిల్, గోరంటలు రాజు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
