మసీదుల్లోకి మహిళల ప్రవేశంపై సుప్రీంలో విచారణ

మసీదుల్లోకి మహిళల ప్రవేశంపై సుప్రీంలో విచారణ

మసీదుల్లో మహిళల ప్రవేశం కోరుతూ పూణేకు చెందిన దంపతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మొదట వారు పుణే లోని మహ్మదీయ జామా మసీద్ లో నమాజ్ చేసుకునేందుకు అనుమతివ్వాలని మసీదు పాలక వర్గాన్ని కోరారు. వారి విజ్ఞప్తిని పాలక కమిటీ తిరస్కరించడంతో ఆ దంపతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

మసీదుల్లో ముస్లిం మహిళలకు కూడా  ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. మసీదులలోకి అనుమతించకపోవడం మహిళల ప్రాథమిక హక్కులను కాలరాయడమే అంటూ తమ పిటిషన్ లో పేర్కొన్నారు ఆ దంపతులు. అలా చేయడం అర్టికల్ 14, 15, 21, 25, 29 లను ఉల్లంఘించడమేనని పిటిషన్ లో తెలిపారు.

ఈ పిటిషన్ పై విచారించిన సుప్రీంకోర్టు.. నేషనల్ ఉమెన్ కమిషన్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు,  కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తాజాగా శబరిమలై కేసులో సుప్రీంకోర్టు తీర్పును పరిగణలోకి తీసుకుంటూ ఈ పిటిషన్ విచారణను స్వీకరించామని జస్టిస్ ఎస్ ఏ బాబ్డే తెలిపారు.