
వికారాబాద్, వెలుగు: విద్యార్థులకు టెక్నికల్ నాలెడ్జ్ అవసరమని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆధునాతన సాంకేతిక కేంద్రం(ఏటీసీ)ను ఆయన సందర్శించారు. అందులో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. లేటెస్ట్ టెక్నాలజీలో పట్టు సాధించేలా వారిని తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. ఐటీఐ ప్రిన్సిపాల్ నరేంద్రబాబు, ఏటీసీ ఇన్చార్జి ఎస్.ఎం.సరూష్ తదితరులు ఉన్నారు.