డీజేకు అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన

డీజేకు అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన

డీజేలపై పోలీసులు ఆంక్షలు విధించడంతో.. నిర్మల్ జిల్లా ముథోల్ లో వినాయక నిమజ్జనం శోభాయాత్ర నిలిచిపోయింది. డీజే ఉంటేనే గణేష్ నిమజ్జనం చేస్తామని నిర్వాహకులు తేల్చి చెప్పారు. డీజేకు వెంటనే అనుమతి ఇవ్వాలంటూ మండపాల నిర్వాహకులు రోడ్డుపై ఆందోళనకు  దిగారు.

ఆందోళనకు దిగినవారిని పోలీసులు చెదరగొట్టారు.  వారిని బలవంతంగా ఇండ్లకు పంపించారు. పోలీసుల తోపులాటలో వృద్ధులు, పలువురికి గాయాలయ్యాయి.  ఈనేపథ్యంలో గణేశ్ మండపాల నిర్వాహకులతో జిల్లా ఎస్పీ చర్చలు జరిపారు.