తాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు : ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్

తాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు : ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్

కుంటాల, వెలుగు: ఎల్‌‌‌‌నినో ప్రభావంతో గ్రామాల్లో తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్మల్ జిల్లా కుంటాల మండలం లింబా కే, ఓల, లింబా బీ, వెంకు ఆర్, విట్టపూర్ గ్రామాల్లో అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. 

కుంటాలలో ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం జనరల్‌‌‌‌ బాడీ మీటింగ్‌‌‌‌లో పాల్గొన్నారు. గ్రామాల వారీగా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై రివ్యూ చేశారు. డీపీవో శ్రీనివాస్, ఎంపీడీవో వెంకటరాజు, సర్పంచులు, అధికారులు, లీడర్లు పాల్గొన్నారు.