కిలో మటన్ కు టిఫిన్ బాక్స్ ఫ్రీ..క్యూ కట్టిన జనాలు

కిలో మటన్ కు టిఫిన్ బాక్స్ ఫ్రీ..క్యూ కట్టిన జనాలు

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నల్లగొండ జిల్లా చండూరులో మటన్ షాపు యజమాని కస్టమర్లకు బంఫరాఫర్ ప్రకటించాడు. కిలో మటన్ కొంటె ఓ టిఫిన్ బాక్స్ ఉచితంగా అందించాడు. ఒక్కరోజే ఆఫర్ ఉండడంతో మటన్ కోసం షాపు ముందు జనాలు క్యూలు కట్టారు. గంట ఆలస్యమైనా కూడా మటన్, టిఫిన్ బాక్సు తీసుకునే వెళ్లారు. పర్యావరణం కోసం ప్లాస్టిక్ కవర్లను నిషేధించేందుకే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు షాపు నిర్వాహకుడు.