పాక్​కు మద్దతుగా పోస్ట్.. యూపీలో ఒకరు అరెస్టు

పాక్​కు మద్దతుగా పోస్ట్.. యూపీలో ఒకరు అరెస్టు

ముజఫర్ నగర్: సోషల్ మీడియాలో పాకిస్తాన్ కు అనుకూలంగా కంటెంట్ ను పోస్ట్ చేయడంతో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం యూపీలోని ముజఫర్ నగర్ లో ఈ ఘటన జరిగింది. ఈ మేరకు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్ పీ) సంజయ్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. నిందితుడు వాట్సాప్ స్టేటస్ లో పాకిస్తాన్ కు అనుకూలంగా కంటెంట్ పోస్ట్ చేయడంతో కేసును నమోదు చేశామని తెలిపారు. 

మరోవైపు శుక్రవారం అన్వర్ జమీల్ అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాన్ని అన్వర్  చేశాడని.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అరెస్టు చేశామని చెప్పారు. అది పాత వీడియో అని అన్వర్ పేర్కొన్నాడని పోలీసులు వివరించారు.