
స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాలన్న ఏపీ సీఎం జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నట్లు తెలిపారు ప్రముఖ సినీ నటుడు నారాయణమూర్తి. తెలుగు మీడియంలో చదివే పిల్లలు సెక్యూరిటీ గార్డులుగా, పోలీసు కానిస్టేబుళ్లుగా మారుతూ చిన్న చిన్న ఉద్యోగాలకే పరిమితం అవుతున్నారన్నారు. ఇంగ్లీష్ మీడియంలో చదివిన వారు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారని ఆయన అన్నారు. LKG నుంచి PG వరకూ ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు రావాలన్నదే తన అభిమతమని తెలిపారు.తనకు ఎదురవుతున్న సమస్యలు, తాను అనుభవించిన సమస్యలపైనే సినిమాలు తీస్తున్నానని చెప్పారు నారాయణమూర్తి. గతంలో తాను నిర్మించిన ‘ఎర్రసైన్యం’ సినిమాలో ఇంగ్లీషు చదువులు లేక వెనుకబడిన తరగతుల వారు ఎలా నష్టపోతున్నారో చూపించామన్నారు. భావి తరాల భవిష్యత్ కోసం ఇంగ్లీష్ విద్య విద్య తప్పనిసరన్నారు నారాయణమూర్తి.