నా వెయిట్ .. నేషనల్ ఇష్యూ అయ్యింది

V6 Velugu Posted on Mar 10, 2021

‘అరే ఆమె చూడరా ఎంతలావు ఉందో’ అంటూ నవ్వుతారు. ‘రేయ్ నువ్వేంట్రా ఇంత నల్లగా పుట్టావు?’ అని బాడీ షేమింగ్ చేస్తారు ఫ్రెండ్స్. అంతే.. ‘నేను బాలేను.. నేను నల్లగా ఉంటాను’ అనే ఆలోచనల్లోకి వెళ్లిపోతారు. ఇక సెలబ్రిటీల విషయమైతే చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇలాంటి కామెంట్స్ చాలానే వినిపిస్తాయి. చాలామంది సెలబ్రిటీలపై సోషల్మీడియాలో విపరీతమైన కామెంట్స్ వస్తుంటాయి. ఆ కామెంట్స్ వల్ల వాళ్లంతా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్లిపోతుంటారు. బాడీ షేమింగ్ వల్ల చాలా డిస్టర్బ్ అయ్యామని ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు చెప్పుకున్నారు. అదే ఇప్పుడు విద్యాబాలన్ విషయంలో కూడా జరిగింది. బాలీవుడ్లో ‘డర్టీ పిక్చర్’, ‘తుమ్హారీ సులు’, ‘శకుంతలాదేవి’ లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన విద్యాబాలన్పై చాలామంది బాడీషేమింగ్ కామెంట్లు చేశారట. ఈమధ్య నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విద్యాబాలన్ ఈ విషయాలు చెప్పింది. “ నేను వెయిట్ పెరగడం నేషనల్ ఇష్యూ అయ్యింది. చాలామంది నేను బరువు పెరగడంపై విపరీతమైన కామెంట్స్ చేశారు. అప్పుడు నా శరీరాన్ని నేనే చాలా అసహ్యించుకున్నాను. నేను సినిమా బ్యాక్గ్రౌండ్లేని ఫ్యామిలీ నుంచి వచ్చాను. 
ఇలాంటి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయని నాకు ఎవరూ చెప్పలేదు. ఎవర్ని వారు ప్రేమించుకోవడం సులభం కాదు. నేను చాలాసార్లు కోపం, ప్రస్ట్రేషన్లోకి వెళ్లిపోయేదాన్ని. నాకు హార్మోన్ సమస్యలు ఉన్నాయి. లావైనప్పుడు నా శరీరాన్ని నేను అసహ్యించుకునేదాన్ని. నా శరీరం నాకు ద్రోహం చేసిందని అనుకునేదాన్ని”అని తన ఫీలింగ్స్ను చెప్పింది విద్యాబాలన్. “ కానీ, రానురాను నేను ఎలా ఉన్నా కూడా దాన్ని  యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టాను. ఎందుకంటే నా బాడీ ఫంక్షనింగ్ ఆగిపోతే నేను ఈ ప్రపంచంలో ఉండననే విషయం తెలుసుకున్నాను. అందుకే, నా శరీరానికి ఎప్పుడూ థాంక్స్ చెప్పుకుంటూనే ఉంటా.  ప్రతిరోజు నన్ను నేను ప్రేమించుకుంటున్నాను.  కానీ, అదేమంత ఈజీకాదు” అని చెప్పింది విద్యాబాలన్.
 

Latest Videos

Subscribe Now

More News