మయన్మార్ లో మఠంపై దాడి..23 మంది మృతి

మయన్మార్ లో మఠంపై దాడి..23 మంది మృతి

న్యూఢిల్లీ: మయన్మార్ లో సగాయింగ్  ప్రాంతంలోని ఓ గ్రామంలో మఠంపై శుక్రవారం వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో 23 మంది చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయడపడ్డారు. దాదాపు 200 మంది నిరాశ్రయులు ఈ మఠంలో తలదాచుకుంటున్నారు. తెల్లవారుజామున లింటాలు గ్రామంలోని మఠంపై ఎయిర్ స్ట్రైక్  జరిగిందని సగాయింగ్  డిస్ట్రిక్ట్  పీపుల్స్  అడ్మినిస్ట్రేషన్  (ఇది ప్రజాస్వామ్య అనుకూల గ్రూప్) హెడ్  లాయింగ్  బ్వా తెలిపారు. 

గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించామని పేర్కొన్నారు. మిలిటరీ జుంటా ప్రభుత్వానికి చెందిన స్టేట్  అడ్మినిస్ట్రేషన్  కౌన్సిల్  ఆ వైమానిక దాడికి పాల్పడిందని స్థానిక ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కాగా.. ఈ ఘటనపై జుంటా తరపు ప్రతినిధి ఇంకా స్పందించలేదు. ఈ దాడికి పాల్పడినట్లు ఏ సంస్థ కూడా ఇంతవరకూ ప్రకటించలేదు.