ఆంగ్సాన్ సూకీకి మరో ఏడేళ్ల జైలుశిక్ష

 ఆంగ్సాన్ సూకీకి మరో ఏడేళ్ల జైలుశిక్ష

ఆంగ్ సాన్ సూకీకి మరో ఏడేళ్ల జైలుశిక్షను విధిస్తూ ఆ దేశ మిలటరీ కోర్టు తీర్పు చెప్పింది. ఐదు అవినీతి కేసుల్లో సూకీ దోషిగా ఉంది. ఆంగ్ సాన్ సూకీని 2021 ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు. మయన్మార్ నాయకురాలుగా ఉన్న సమయంలో హెలికాప్టర్ లీజుకు తీసుకున్న కేసులో అరెస్ట్ చేశారు. పాతకేసులన్నీ మళ్లీ విచారించిన మిలటరీ కోర్టు మరో ఐదు కేసుల్లోఆమె కు శిక్షను ఏడేండ్లు పొడిగించారు.  అన్ని కేసుల్లో కలిపి మొత్తం 15 ఏండ్లు సూకీ జైలు శిక్ష అనుభవించనున్నారు. 

నోబెల్ ప్రైజ్ విజేత అయిన ఆంగ్‌సాన్ సూకీ మయన్మార్‌లో ప్రజాస్వామ్యం కోసం దశాబ్దాలుగా పోరాటం చేశారు. ఆమె తన రాజకీయ జీవితంలో చాలా వరకు జైలులోనే గడిపారు. మయన్మార్‌లోని మిలిటరీ ప్రభుత్వం ఆమెను వివిధ కేసుల్లో జైలు ఉంచింది. సూకీ 2015 నుంచి మయన్మార్‌లో ఐదేళ్ల పాటు ప్రజాస్వామికంగా పాలన చేశారు. అది వరకు ఉన్న 49 ఏళ్ల మిలిటరీ పాలనకు మంగళం పాడారు. ఆమెను అనేక కేసుల్లో ఇరికించారు. కొవిడ్19 ఆంక్షలు ఉల్లంఘించి ప్రచారం చేయడం, అక్రమంగా రేడియో పరికరం కలిగి ఉండడం, రెచ్చగొట్టడం, ప్రభుత్వ రహస్య చట్టాన్ని ఉల్లంఘించడం, దేశ ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయడం వంటి వివిధ రకాల నేరాభియోగాలను ఆమెపై సైనిక ప్రభుత్వం మోపింది.