మైలార్ దేవ్ పల్లిలో 30 కేజీల గంజాయి పట్టివేత

 మైలార్ దేవ్ పల్లిలో 30 కేజీల గంజాయి పట్టివేత
  • ఇద్దరిని అరెస్ట్ మైలార్ దేవ్ పల్లి పోలీసులు

శంషాబాద్, వెలుగు:  గంజాయి తరలిస్తున్న ఇద్దరిని మైలార్ దేవ్ పల్లి పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితులు అయాన్ అలీ ఖాన్, మొయినుద్దీన్ గా గుర్తించి.. వారి వద్ద సుమారు 30 కేజీల గంజాయిని, ఆటో, బైక్‌‌‌‌‌‌‌‌ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

ఆరు బెల్ట్ షాపులపై దాడి.. 241 లీటర్ల మద్యం స్వాధీనం

శంషాబాద్ ఎక్సైజ్ జోన్ పరిధిలోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్, రాజేంద్రనగర్, మైలార్ దేవ్ పల్లి, అత్తాపూర్, నార్సింగి పోలీస్ స్టేషన్ల పరిధిలో అక్రమంగా మద్యం అమ్ముతున్న 6  బెల్ట్ షాప్ లపై సోమవారం శంషాబాద్ ఎక్సైజ్, ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. 241 లీటర్ల అక్రమ మద్యం పట్టుకోగా.. విలువ 1,54,000 రూపా యలు ఉంటుంది. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
 
ఘట్ కేసర్ లో ఇద్దరు మహిళలు

ఘట్ కేసర్ : మద్యం అమ్ముతున్న ఇద్దరు మహిళలను ఘట్ కేసర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అడ్మిన్ ఎస్ఐ రాము నాయక్ తెలిపిన మేరకు..మైసమ్మ గుట్ట కాలనీలో నర్రి మైసమ్మ తన ఇంట్లో 36 బాటిళ్లు, టౌన్ పరిధిలోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో పంజాల బాలలక్ష్మి ఇంట్లో 45 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.