ప్రేమించుకుని పెద్దలను ఒప్పించారు.. కాసేపట్లో పెళ్లి అనగా.. ఇంటికెళ్లి కాబోయే భార్యను చంపేశాడు !

ప్రేమించుకుని పెద్దలను ఒప్పించారు.. కాసేపట్లో పెళ్లి అనగా.. ఇంటికెళ్లి కాబోయే భార్యను చంపేశాడు !

పెళ్లంటే మూడు ముళ్లు, ఏడడుగులు, ఏడు జన్మల  బంధం అంటూ చెప్తుంటారు పెద్దలు. ఇటీవలి కాలంలో చాలా పెళ్లిల్లు కొద్దిరోజులకే పెటాకులవుతున్నాయి. కానీ ఇక్కడ పెళ్లి కాకముందే.. మరికాసేపట్లో తాళి కట్టాల్సిన పెళ్లికొడుకు అత్యంత కర్కషంగా, రాక్షసంగా పెళ్లి కూతురును చంపేశాడు. తమ కూతురు పెళ్లి వైభంగా జరిపి పంపాలనుకున్న తల్లిందడ్రుల కలలు కల్లలుగా మిగిలిపోయాయి. మరోవైపు వధూవరులను ఆశీర్వదించాలని వచ్చిన బంధువుల చేతికి అందాల్సిన అక్షింతలు అలాగే మిగిలిపోయాయి. పెళ్లి జరగాల్సిన ఇంట్లో చావు కల్లజూడటంతో ఆ కుటుంబం తీవ్ర దుఖసంద్రంలో మునిగిపోయింది. ఈ హృదయ విదారక ఘటన గుజరాత్ లో కలకలం రేపింది. 

వివారల్లోకి వెళ్తే.. గుజరాత్ లోని భావ్ నగర్ లో 24 ఏళ్ల యువతిని దారుణంగా చంపేశాడు ఆమెకు కాబోయే భర్త. 2025 నవంబర్ 15న మధ్యాహ్నం పెళ్లి కావాల్సి ఉండగా.. ఉదయం ఆమె ఇంటికెళ్లి చంపేసి పారిపోయాడు. చీర గురించి వచ్చిన వివాదంతో ఏకంగా నూరేళ్లు కలిసి నడవాల్సిన కాబోయే భార్యను పొట్టన పెట్టుకున్నాడు దుర్మా్గుడు. 

నిందితుడిని సజన్ బరైయా గా గుర్తించారు పోలీసులు. దుర్మార్గుడి కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. చనిపోయిన బాధితురాలు సోనీ రాథోడ్ కు, సజన్ కు నవంబర్ 15 న పెళ్లి కావాల్సి ఉంది. అదే రోజు ఉదయం సోనీ ఇంటికెళ్లాడు సజన్. చీర ఖర్చు, మిగతా డబ్బుల విషయంలో ఇద్దరి మధ్యలో తీవ్ర వాగ్వాదం జరిగినట్లు చెబుతున్నారు పోలీసులు. చీర ఖర్చు ఎక్కవైందని.. తమతో పెళ్లికి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టిస్తున్నారని సోనీతో గొడవకు దిగినట్లు తెలుస్తోంది. 

ఇద్దరి  మధ్య జరిగిన వాగ్వాదంలో ఐరన్ పైపుతో సోనీ తలపై కొట్టాడు సజన్. అంతే కాకుండా కోపంతో ఊగుతూ ఆమె తలను గోడకేసి బాదాడు. ఆమె రక్తపు మడుగులో పడి ఉండగా పరిపోయాడు దుర్మార్గుడు. ఆ తర్వాత కాసేపటికే చనిపోయినట్లు చెప్పారు పోలీసులు. 

పెళ్లికి ముందే ప్రేమ:

ఈ మర్డర్ గంగా జలియా పోలీస్ స్టేషన్ ఏరియాలో జరిగింది. ఇద్దరూ పెళ్లికి ముందే ప్రేమించుకున్నట్లు.. మ్యారేజ్ ఫిక్స్ కాకముందు నుంచే కలిసి ఉంటున్నట్లు డీసీపీ ఆర్ఆర్ సింధాల్ చెప్పారు. పెళ్లి రోజు మార్ణింగ్ ఇద్దరి మధ్య జరిగిన గొడవలో సహనం కోల్పోయి పెళ్లి కూతురును చంపేశాడని తెలిపారు. 

ఈ ఘటన జరగక ముందు రోజు కూడా సజన్ ఇతరులతో గొడవకు దిగినట్లు పోలీసులు చెప్పారు. ఆ గొడవపై FIR కూడా నమోదైనట్లు తెలిపారు. 24 గంటలు గడవక ముందే మరో కాబోయే భార్యతో గొడవ పడి చంపేశాడు.