
ఇకపై మైసూర్ పాక్ను అలా పిలవొద్దు..మైసూర్ శ్రీ అని పిలవాలి..జైపూర్లో స్వీట్ షాపుల్లో మొత్తం ఇదే బోర్డులు..మైసూర్ పాక్ ఒక్కటే కాదు.. పాక్ అనే పదం ఉన్న అన్ని స్వీట్ల పేర్లు మార్చేశారు. పాక్ ఎక్కడ ఉన్నా దానిని రీప్లేస్ చేస్తాం..పాక్ అనే పదం మాకు నచ్చదు అంటున్నారు అక్కడి స్వీట్ షాపు యజమానులు. షాపు యజమానులు ఎందుకు అలా చేస్తున్నారో.. అలా ఎందుకు చెబుతున్నారో వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్‌లోని జైపూర్‌లోని స్వీట్ షాపులన్నీ ప్రసిద్ధ మైసూర్ పాక్తో సహా అన్ని స్వీట్ల పేర్లను మార్చాయి.తమ స్వీట్ల పేర్లన్నింటి నుంచి 'పాక్' అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో 'శ్రీ'అని చేర్చారు. మైసూర్ పాక్ ను మైసూర్ శ్రీగా, మోతీ పాక్' ను 'మోతీ శ్రీ' గా, 'గోండ్ పాక్' ను 'గోండ్ శ్రీ' గా, మార్చారు.
ఇదంతా ఎందుకు చేశారంటే.. భారత్, పాక్ ఉద్రిక్తతల మధ్య పాక్ అనే పదం వినపడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామని షాపు యజమానులు చెబుతున్నారు. వాస్తవానికి పాక్ అంటే పాకిస్తాన్ ను సూచించదు. పాక్ అంటే కన్నడంతో తీపి అని అర్థం. కర్ణాటకలోని మైసూర్ పేరు మీద వచ్చిన ఘనీకృత పాలతో పొడి తీపిపదార్థాన్ని 'మైసూర్ పాక్' అని పిలుస్తారు.
ALSO READ | కర్ణాటకలో కొత్త రిజిస్ట్రేషన్ రూల్.. బెంగళూరులో ఇల్లు కొంటున్న తెలుగోళ్లకు అలర్ట్..
ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు, ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ సింధూర్ ప్రారంభించడం.. పాక్ లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేయడం, ఆ తర్వాత ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది.
ఈ క్రమంలో సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర లో ని సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలు పాక్ పై ఆగ్రహంతో ఉన్నారు. దీంతో రాజస్థాన్ లోని జైపూర్ స్వీట్ సెంటర్ యజమానులు పాక్ పై ఇలా తమ అసహనం వ్యక్తం చేశారు.