బ్రెజిల్‌లో విచిత్రం: ఒంటిపై 26 ఐఫోన్లు అతికించుకొని 20 ఏళ్ల యువతి మృతి..

బ్రెజిల్‌లో విచిత్రం: ఒంటిపై 26 ఐఫోన్లు అతికించుకొని 20 ఏళ్ల యువతి మృతి..

బ్రెజిల్‌లో దేశంలో ఎవరు ఉహించని ఘటన జరిగింది. ఒ బస్సులో 20 ఏళ్ల మహిళ మృతదేహంకి 26 ఐఫోన్‌లు అతికించి ఉండటం తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. పరానాలోని గ్వారపువా నుండి ప్రయాణిస్తున్న ఆమె అనారోగ్యానికి గురికావడంతో, ఎమర్జెన్సీ సిబ్బంది ఆమె శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం లేక కళ్ళు తిరిగి పడిపోయి ఉండొచ్చని గుర్తించారు. 

వెంటనే ఆమెకు బస్సులోనే చికిత్స అందించిన గుండెపోటు వచ్చి కొద్దిసేపటికే మరణించింది. పారామెడిక్స్ ఆమెను బతికించడానికి 45 నిమిషాల పాటు ప్రయత్నించగా ఫలితం లేకపోయింది. మిలిటరీ పోలీసుల ప్రకారం, 26 ఐఫోన్‌లు ఆమె శరీరానికి అతికించి ఉన్నాయి. దీని పై  దర్యాప్తు కోసం సైంటిఫిక్ పోలీస్ అండ్ సివిల్ పోలీసుల నుండి ఫోరెన్సిక్ బృందాలను సంఘటనా స్థలానికి పిలిపించారు. స్నిఫర్ డాగ్ కూడా ఎటువంటి మాదకద్రవ్యాలను గుర్తించలేదు, కానీ ఆమె లగేజీలో చాల  మద్యం బాటిళ్లు ఉన్నాయి. వీటిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

పరానా సివిల్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తుండగా, ఆమె మరణానికి కారణం స్పష్టంగా  తెలియాలంటే ఫోరెన్సిక్ రిపోర్ట్స్ రావాలని తెలిపారు. దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకున్న ఐఫోన్‌లను బ్రెజిల్ ఫెడరల్ రెవెన్యూ సర్వీస్‌కు పంపారు. అయితే ఆ మహిళ గుర్తింపు లేదా డ్రగ్స్ సంబంధించి అధరాలు దొరికాయ లేదా దాని పై  అధికారులు సమాచారాన్ని విడుదల చేయలేదు.