RC17 Update: చెర్రీ-సుక్కు ప్రాజెక్ట్ అప్డేట్.. కొత్త కబుర్లతో కిక్ ఇచ్చే విషయాలు.. మరో రంగస్థలమే!

RC17 Update: చెర్రీ-సుక్కు ప్రాజెక్ట్ అప్డేట్.. కొత్త కబుర్లతో కిక్ ఇచ్చే విషయాలు.. మరో రంగస్థలమే!

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. ఏఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రహమాన్‌‌‌‌‌‌‌‌ కంపోజ్‌‌‌‌‌‌‌‌ చేసిన ఫీల్‌‌‌‌‌‌‌‌ గుడ్‌‌‌‌‌‌‌‌ లవ్‌‌‌‌‌‌‌‌ సాంగ్‌‌‌‌‌‌‌‌ను త్వరలో ఫస్ట్ సింగిల్‌‌‌‌‌‌‌‌గా రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నటించబోతున్నాడు రామ్ చరణ్. గతంలో వీళ్లిద్దరి కాంబోలో ‘రంగస్థలం’ చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇటీవలే జరిగిన ‘డ్యూడ్‌‌‌‌‌‌‌‌’ మూవీ సక్సెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌లో నిర్మాత నవీన్ యెర్నేని ఈ మూవీ గురించిన అప్‌‌‌‌‌‌‌‌డేట్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు.

‘పుష్ప 3’ కంటే ముందు సుకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. చరణ్‌‌‌‌‌‌‌‌తో సినిమా చేయబోతున్నారని ‘పెద్ది’ షూటింగ్ పూర్తయ్యాక ఇది ఉండబోతోందని చెప్పారు.  వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో షూటింగ్‌‌‌‌‌‌‌‌ స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేసేలా ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు.రామ్ చరణ్‌‌‌‌‌‌‌‌ బర్త్ డే సందర్భంగా మార్చి 27న ‘పెద్ది’ విడుదల కానుండగా, వెంటనే సుకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినిమాపై చరణ్‌‌‌‌‌‌‌‌ దృష్టి సారించనున్నాడు.  

ఇప్పటికే ఈ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. అలాంటి కాంబో ఇప్పుడు మరోసారి రిపీట్ అవుతుండటంతో మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన కథా చర్చలు కూడా పూర్తయ్యి.. అనౌన్స్ మెంట్ కూడా జరిగిపోయింది.

అలాగే, లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. RC17లో ఓ టాప్ టాలెంటెడ్ బ్యూటీని రంగంలోకి దింపనున్నారట సుకుమార్. తన సహజమైన నటనతో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దుల్ని చేసే హీరోయిన్ని పట్టుకొస్తున్నాడట. ఎవరో తెలుసా..? తనే మోస్ట్ వాంటెడ్ సాయి పల్లవి (Sai Pallavi).

డైరెక్టర్ సుక్కు.. తన సినిమాలలో హీరోయిన్స్కి బలమైన క్యారెక్టర్స్ డిజైన్ చేయడంలో సిద్ధహస్తుడు. ఇక ఈ సినిమాలో కూడా రామ్ చరణ్ కోసం సాయి పల్లవి అయితేనే బెస్ట్ ఇస్తుందని సెలెక్ట్ చేసాడట సుక్కు. ఇదే కనుక నిజమైతే మరో రంగస్థలమే! త్వరలో ఈ విషయంపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.